Papikondalu Tour : ప్రకృతి ప్రేమికులకు పండుగ వార్త..దసరా వేళ పాపికొండల టూర్ రీ-ఓపెన్
Papikondalu Tour : పాపికొండల అందాలతో పాటు ఆధ్యాత్మిక భావనలు పంచే పేరంటాలపల్లి ప్రాంతాన్ని సందర్శించడానికి టూరిస్టులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
Papikondalu Tour
రొటీన్ కాంక్రీట్ జంగిల్ లైఫ్ నుంచి, ట్రాఫిక్ గోలలు, ఒత్తిడిల నుంచి కాస్త గ్యాప్ తీసుకుని.. ప్రకృతి ఒడిలో రీఛార్జ్ అవ్వాలని అందరికీ ఉంటుంది. సరిగ్గా అలాంటి వారికి అదిరిపోయే తీపి కబురు వచ్చేసింది. తూర్పు కనుమల మధ్యగా పచ్చటి కొండల నడుమ.. వయ్యారంగా ప్రవహించే పవిత్ర గోదావరమ్మ నది మీదుగా సాగే పాపికొండల విహారయాత్ర(Papikondalu Tour) అక్టోబర్ 13తో మళ్లీ ప్రారంభమైంది.
సుమారు 75 రోజుల విరామం తర్వాత బోటింగ్ పర్మిషన్లు మళ్లీ రావడంతో గోదావరి తీరంలో పర్యాటకుల సందడి మొదలైంది. రాజమహేంద్రవరం నుంచి దాదాపు 35 కి.మీటర్ల దూరంలో ఉండే గండిపోచమ్మ బోటు పాయింట్ వద్ద టూరిస్టులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రీ ఓపెన్ సందర్భంగా రెండు బోట్లలో సుమారు 130 మందికి పైగా టూరిస్టులు తూరుపు కనుమల మధ్యగా పచ్చని కొండల నడుమ ప్రయాణించి ఆ ప్రకృతి మ్యాజిక్‌ను ఆస్వాదించారు.
పాపికొండల అందాలు కంటే ముందుగానే.. రాజమండ్రి నుంచి బయలుదేరి గండిపోచమ్మ పాయింట్‌కు వెళ్లే దారి పొడవునా పలకరించే ప్రకృతి దృశ్యాలు మనసును కట్టిపడేస్తాయి. ఆ తర్వాత బోటు ఎక్కిన మరుక్షణం నేచర్ అందాల నడుమ అందరికీ అసలైన లైఫ్ ఎక్స్పీరియన్స్ మొదలవుతుంది.
ఆకాశాన్ని తాకుతున్నాయేమోననే అనుభూతినిచ్చేలా కనిపించే ఎత్తయిన కొండల మధ్య నుంచి, వంపులు తిరుగుతూ సాగే గోదావరమ్మ ప్రవాహం, నదీ తీరాన అక్కడక్కడా ఒదిగి ఉన్న పల్లెటూళ్ల అందాలు పర్యాటకులను వేరే లోకంలోకి తీసుకెళ్తాయి.
దసరా సెలవుల సమయంలోనే పాపికొండల ట్రిప్(Papikondalu Tour) ఓపెన్ అవడంతో.. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ బ్యాచ్‌లు క్రేజీగా ఈ టూర్ కోసం ప్లాన్స్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు దేవీపట్నం పరిసర ప్రాంతాలు ఎన్నో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవగా.. ఇప్పుడు పాపికొండల అందాలతో పాటు ఆధ్యాత్మిక భావనలు పంచే పేరంటాలపల్లి ప్రాంతాన్ని సందర్శించడానికి టూరిస్టులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.చాలా కాలంగా పాపికొండల బోటు సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న టూరిస్టుల నిరీక్షణకు తెరపడటంతో,వరుస బుకింగ్స్ జోరందుకున్నాయి.

పచ్చటి కొండల నడుమ నుంచి వీచే చల్లటి గాలికి గోదావరి అలల సవ్వడి తోడవడంతో అక్కడి వాతావరణం ప్రతీ ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, రీల్స్ అంటే క్రేజ్ ఉన్న యూత్‌కు, ఫ్యామిలీతో కలిసి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్న వారికి ఇది పర్ఫెక్ట్ టైమ్ అండ్ డెస్టినేషన్ అనే చెప్పొచ్చు.
కేవలం ఒక విహారయాత్రకు వెళుతున్నామనే ఫీలింగ్ కాకుండా ప్రకృతిని ఇంత దగ్గరగా, ఇంత అందంగా చూసే అవకాశం.. పాపికొండల్లో మాత్రమే సాధ్యమవుతుందని టూరిస్టులు సంతోషంగా చెబుతున్నారు.





