Bigg BossJust EntertainmentLatest News

Tuesday Nominations : నామినేషన్స్‌లో మళ్లీ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ 6మంది కంటెస్టెంట్స్..

Tuesday Nominations : వర్షిణి ఇదివరకే నామినేషన్లలో ఉండటంతో ఝాన్సీ, రామ్ ప్రసాద్‌లలో ఒకరిని ఎంచుకోమని కెప్టెన్ సుధీర్‌ను బిగ్ బాస్ కోరాడు.

Tuesday Nominations

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతీ వీక్ నామినేషన్ల ప్రాసెస్ అంటేనే ఒక పెద్ద హైడ్రామా. ముఖ్యంగా ఈసారి నామినేషన్ల ఎపిసోడ్ మరీ పీక్స్‌కు వెళ్లింది. ముందు రోజు ఎపిసోడ్ కంటిన్యూయేషన్‌గా సాగిన మంగళవారం ఎపిసోడ్‌లో షాలిని.. వర్షిణి పేరు చెప్పి నామినేట్(Tuesday Nominations) చేయడంతో రచ్చ స్టార్టయింది.

వర్షిణి డిఫెండ్ చేసుకుంటుంటే మధ్యలో అరిచిన షాలినికి ఎప్పటిలాగా రోహిత్ సపోర్ట్‌గా నిలిచాడు. కొత్తగా వచ్చిన శివకుమార్‌ను కూడా లాగి సెలబ్రిటీల గ్రూపిజం అని కామెంట్ అక్కడ పెద్ద గొడవే జరిగింది. చివరికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నీతూ మాస్టర్ ఇంటర్‌ఫియరెన్స్‌తో వర్షిణి నామినేషన్ ఫైనల్ అయింది.

ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో వైల్డ్ కార్డ్ దక్షి.. దేబ్జానీ, నరేష్‌ మధ్య పెట్టిన టాస్క్‌లో దేబ్జానీ గెలిచి షాలినిని నామినేట్ చేసింది. రోహిత్‌తో కలిసి ఆడుతున్న గ్రూప్ గేమ్‌పై దేబ్జానీ ప్రశ్నిస్తుండగానే షాలిని గిల్టీగా ఫీలై మళ్లీ హంగామా క్రియేట్ చేసింది.. హర్ట్ చేసేలా కామెడీ చేయొద్దంటూ రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేయగా, దక్షి సపోర్ట్‌తో షాలిని నామినేషన్ ఓకే అయింది. అయితే ఈ డెసిషన్‌పై కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరిపైకి దూసుకెళ్లిన షాలిని.. నీతూ మాస్టర్‌పై కూడా ఫైర్ అయింది.

ఈ గొడవలకు తోడు రోహిత్ కూడా మధ్యలో దూరి రచ్చ చేయడంతో మరింత నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. రామకృష్ణ నిర్వహించిన టాస్క్‌లో వంశీ గెలిచి షాలిని, ముకేశ్‌ను నామినేట్ చేయగా.. షాలిని డిఫెండ్ చేసుకోవడం మానేసి అరవడమే పనిగా పెట్టుకుంది. దీంతో బిగ్ బాస్ జోక్యం చేసుకుని మిగతా రౌండ్‌కు వెళ్లమని ఆర్డర్ వేశాడు.

బిగ్ బాస్ టాస్కులో ఓడిపోయిన వారికి మరో ఛాన్స్ ఇవ్వగా.. త్రిగుణ్ గెలిచి రోహిత్ చేస్తున్న గ్రూపిజమ్‌ గురించి చెప్పి అతడిని నామినేట్ చేశాడు. ఇక అమన్, రామ్ ప్రసాద్‌ మధ్య టాస్క్‌లో అమన్ గెలిచి వర్షిణిని నామినేట్ చేశాడు. గతంలో ఒక టాస్క్‌లో హగ్ చేసుకున్న విషయాన్ని హోస్ట్ నాగార్జున స్వయంగా వద్దని చెప్పినా, మళ్లీ ఆ పాయింట్‌నే అమన్ బయటకు తీయడంతో వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది.

మరోవైపు నరేష్ గెలిచి రోహిత్‌ను నామినేట్ చేస్తూ.. చరణ్ ఎలిమినేషన్ టైమ్‌లో రోహిత్ చూపించిన డబుల్ స్టాండ్స్‌ను బయటపెట్టాడు. చరణ్ బెటర్ అని చెప్పిన రోహిత్.. నామినేషన్ల నుంచి కాపాడటానికి షాలినికి ఎందుకు ఓటు వేశావని నరేష్ ప్రశ్నించడంతో రోహిత్ రీఎంట్రీ పేరుతో కవర్ చేయడానికి ట్రై చేశాడు.

Tuesday Nominations
Tuesday Nominations

చివరిగా ఓడిపోయిన వారిలో వర్షిణి ఇదివరకే నామినేషన్లలో ఉండటంతో ఝాన్సీ, రామ్ ప్రసాద్‌లలో ఒకరిని ఎంచుకోమని కెప్టెన్ సుధీర్‌ను బిగ్ బాస్ కోరాడు. దీంతో సుధీర్ ఏమాత్రం ఆలోచించకుండా రామ్ ప్రసాద్ పేరును చెప్పేశాడు. దీంతో ఈ వారం డేంజర్ జోన్‌లో వంశీ, రోహిత్, వర్షిణి, అమన్, షాలిని , రామ్ ప్రసాద్ నిలిచారు.

ఇక మంగళవారం(Tuesday Nominations) ఎపిసోడ్ చివరిలో నరేష్, రామ్ ప్రసాద్ ఇద్దరూ బురదలో ఆడుకుంటూ చిల్ అవ్వగా.. చరణ్ గురించి పాజిటివ్‌గా మాట్లాడాడంటూ షాలిని మళ్లీ రోహిత్‌తో గొడవ పెట్టుకుంది. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరా అని ఇప్పటినుంచే ఆడియన్స్ చర్చ షురూ చేశారు.

Papikondalu Tour : ప్రకృతి ప్రేమికులకు పండుగ వార్త..దసరా వేళ పాపికొండల టూర్ రీ-ఓపెన్

Related Articles

Back to top button