Bigg BossJust EntertainmentLatest News

Wild Cards Game : బిగ్ బాస్ 6వ వారం రచ్చ.. వైల్డ్ కార్డ్స్ మైండ్ గేమ్‌కు ఓజీలు విలవిల..

Wild Cards Game : తన వల్ల టీమ్ ఓడిపోయిందనే బాధ తట్టుకోలేక వంశీ ఆవేశంలో తనని తాను కొట్టుకుంటూ సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకోవడంతో ఇంట్లో అందరూ షాక్‌ అయ్యారు.

Wild Cards Game

బుల్లితెరపై రియాలిటీ గేమ్‌లన్నిటికి బాప్‌గా నిలిచే బిగ్ బాస్ హౌస్‌లో ఆరో వారం ఇంకాస్త హీట్ పెరిగింది. ఈసారి లోపలికి అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఎందుకో కానీ బిగ్ బాస్ ఫస్ట్ నుంచే రెడ్ కార్పెట్ వేస్తూ ఓజీ కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సరిగ్గా కెప్టెన్సీ కంటెండర్ల వేట స్టార్ట్ అయ్యేసరికి వైల్డ్ కార్డులందరికీ(Wild Cards Game) డైరెక్టుగా రేసులో నిలిచే రేర్ ఛాన్స్ ఇచ్చేసి పాతవాళ్లకు గట్టి షాకే ఇచ్చాడు.

అయితే ఆ చైర్స్ కాపాడుకుంటూ పాయింట్ల చార్ట్‌లో టాప్‌లో నిలబడితేనే కెప్టెన్సీ ఛాన్స్ దక్కుతుందనే కండీషన్ పెట్టేసరికి బిగ్ బాస్ హౌస్‌లో అసలు రచ్చ మొదలైంది. ఏరియాలను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనే టాస్క్‌లో ఎవరికి వారు రూల్స్ పక్కనపెట్టి మరీ ఆడేయడంతో బిగ్ బాస్ కోపంతో ఆ ఆటను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.

ఇక ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ , ఓజీల గురించి వైల్డ్ కార్డులు(Wild Cards Game) అనుకుంటున్న అభిప్రాయాలకు సంబంధించిన ట్యాగ్‌లను కనిపెట్టే నయా డ్రామాను స్క్రీన్ మీదికి తెచ్చాడు. దీనిలో గ్రీన్ టీమ్ కాస్త చాకచక్యంగా ఆడి పాయింట్లు కొట్టేయడంతో గ్రీన్, గోల్డ్ టీమ్‌లు చెరో 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. బ్లూ టీమ్ మాత్రం 2 పాయింట్లకే పరిమితమైంది.

టై అయిన ఆ 2 టీమ్‌ల మధ్య విజేత ఎవరో తేల్చడానికి బిగ్ బాస్ .. గార్డెన్‌లో ఎక్కడో దాచి ఉంచిన ఫుడ్ అండ్ ప్లేట్‌ను వెతికి పట్టుకుని, దానిని తెచ్చి ఒక పెడస్టల్ మీద అమర్చిన తర్వాత అక్కడే ఉన్న గంట కొట్టాలనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించగా, వంశీ , శివ్‌ నువ్వా నేనా అంటూ తలపడ్డారు.

ఇక్కడే బిగ్ బాస్ సీజన్‌లో జరగని ఒక సిల్లీ డ్రామా జరిగింది. వంశీ ఎంతో కష్టపడి ఆ ఫుడ్, ప్లేట్‌ను కనిపెట్టేసి..తొందరలో అసలైన మెయిన్ రూల్ మరిచిపోయి దాన్ని పెడస్టల్‌పై పెట్టకుండానే వెళ్లి గంట కొట్టేశాడు. గేమ్ ఇంకా అవ్వలేదు బాస్.. కాస్త ఆలోచించుకో అని సంచాలక్ త్రిగుణ్ వార్నింగ్ ఇస్తున్న లోపే, లోపల నుంచి వర్షిణి గట్టిగా అరుస్తూ పెడస్టల్ మీద పెట్టాలంటూ హింట్ ఇచ్చేసింది. ఆ ఒక్క హింట్‌తో సీన్ మొత్తం రివర్స్ అయింది.

పక్కనే ఉన్న శివ్ ఏమాత్రం లేట్ చేయకుండా అలర్ట్ అయి వంశీ చేతిలో ఉన్న ప్లేట్‌ను లాక్కున్నాడు. దీంతో వర్షిణి లోపల నుంచి ఇది అన్ ఫెయిర్ గేమ్ అంటూ గగ్గోలు పెట్టినా గేమ్ ఆగలేదు. శివ్ తెలివిగా ఆ ప్లేట్ తీసుకెళ్లి పెడస్టల్ మీద పెట్టాడు. అయితే అక్కడైనా వంశీ ఫుడ్ పెడతాడేమోనని చూశాడు. కానీ చివరికి ఫుడ్‌ను, ప్లేట్‌ను రెండింటినీ పర్ఫెక్ట్‌గా సెట్ చేసి ఆట ఫినిష్ చేసిన శివ్‌కే ఈ విజయం దక్కింది. సంచాలక్ త్రిగుణ్ కూడా అదే కరెక్ట్ అని డిసైడ్ చేయడంతో వంశీ చేసిన ఒకే ఒక్క తొందరపాటు డెసిషన్ వల్ల గెలిచే మ్యాచ్ ఊహించని విధంగా చేజారిపోయింది.

Wild Cards Game
Wild Cards Game

తన వల్ల టీమ్ ఓడిపోయిందనే బాధ తట్టుకోలేక వంశీ ఆవేశంలో తనని తాను కొట్టుకుంటూ సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకోవడంతో ఇంట్లో అందరూ షాక్‌ అయ్యారు. పక్కనున్న శివ్, త్రిగుణ్ ఎంతగా అడ్డుకున్నా వంశీ ఆగకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ స్మోకింగ్ ఏరియాకు వెళ్లి ఎమోషనల్ అయ్యాడు. దీంతో త్రిగుణ్ కూడా తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోగా, దేబ్జానీ వచ్చి అతడిని ఓదార్చింది. చివరకు ఎమోషనల్ అయిన త్రిగుణ్ స్మోకింగ్ జోన్‌కు వెళ్లి వంశీని గట్టిగా హగ్ చేసుకుని.. ఇద్దరూ ఏడ్చేశారు. దీంతో గురువారం ఎపిసోడ్‌లో డ్రామా కాస్త పీక్స్‌కు చేరినట్లు అయింది.

SIR Process : సర్ ప్రాసెస్‌పై ఎందుకీ వివాదం? 17 రాష్ట్రాల్లో ప్రారంభమవుతున్న ప్రక్రియతో ఎండ్ కార్డ్ పడుతుందా?

Related Articles

Back to top button