Just EntertainmentLatest News

Sai Pallavi : రామాయణ ఈవెంట్‌లో మెరిసిన సీతమ్మ..రణ్‌బీర్, యశ్ మధ్యలో స్పెషల్ అట్రాక్షన్‌గా సాయి పల్లవి!

Sai Pallavi : రోల్‌కు తగినట్లుగానే అత్యంత ట్రెడిషనల్‌గా, దేవతా మూర్తే దిగి వచ్చిందా అన్నట్లుగా గులాబీ రంగు సిల్క్ శారీలో సాయి పల్లవి మెరిసిపోయింది.

Sai Pallavi

ఇండియన్ సినీ హిస్టరీలోనే ఎప్పుడూ లేనంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ విజువల్ వండర్ ‘రామాయణ’ మూవీ సందడి నేషనల్ వైడ్ స్టార్టయిపోయింది. ఈ మైథలాజికల్ వండర్ ఇంటర్నేషనల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 15న బెంగళూరు వేదికగా అత్యంత వైభవంగా జరిగింది.

మిరుమిట్లు గొలిపే లైటింగ్స్‌తో కలర్‌ఫుల్‌గా జరిగిన ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్‌తో పాటు మూవీ యూనిట్ అంతా సందడి చేసింది. అయితే ఎంతమంది స్టార్లు ఉన్నా..ఈ ఈవెంట్‌లో సీతాదేవిగా నటించిన సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

రోల్‌కు తగినట్లుగానే అత్యంత ట్రెడిషనల్‌గా, దేవతా మూర్తే దిగి వచ్చిందా అన్నట్లుగా గులాబీ రంగు సిల్క్ శారీలో సాయి పల్లవి(Sai Pallavi) మెరిసిపోయింది. వెండి జర్దోసీ డిజైన్,  కట్‌వర్క్ బోర్డర్స్‌తో ఉన్న ఆ పట్టుచీరలో రాజసం ఉట్టిపడింది. దానికి తగ్గట్టుగానే ఎల్బో లెంగ్త్ బ్లౌజ్, సింపుల్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్‌తో ఎలాంటి హంగులు లేకుండా ప్యూర్ నేచురల్ లుక్‌లో కనిపిస్తూ అందరి చూపులనూ తనవైపు తిప్పుకుంది.

ఈ వేదికపై కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అక్కడి వారందరినీ అలరించిన సాయి పల్లవి(Sai Pallavi), సీతాదేవి వంటి అత్యంత పవిత్రమైన రోల్‌ను పోషించడం తన పూర్వజన్మ సుకృతమని, ఇదొక గొప్ప బాధ్యత అని ఎమోషనల్ అయింది. నితీశ్ తివారీ కాంబోలో టూ పార్ట్స్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ ఎపిక్ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ ట్రైలర్ లాంచ్‌తో మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి అనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు.


Tesla Roadster : ఎగిరే కార్లు ఇక కల కాదు..గాల్లో ఎగిరి ఆశ్చర్యపరిచిన టెస్లా రోడ్‌స్టర్

Related Articles

Back to top button