Just EntertainmentLatest News

Ranabaali : విజయ్ దేవరకొండ మాస్ రౌద్రం.. రణబాలి ఎలా ఉందంటే..

Ranabaali : సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ జీవించేశాడనే చెప్పొచ్చు. జయమ్మ పాత్రలో రష్మిక మందన్న చాలా హోమ్లీగా, అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.

Ranabaali

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సూపర్ హిట్‌ కాంబోలో రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ ‘రణబాలి’ థియేటర్లలో రచ్చ చేస్తోంది. 1850ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ బ్యాక్ డ్రాప్‌తో, బ్రిటిష్ వారి దోపిడీ వల్ల భారత దేశంలో ఏర్పడిన తీవ్రమైన కరవు, ఆకలి చావుల చుట్టూ ఈ స్టోరీ అంతా తిరుగుతుంది. ఇక్కడి ధాన్యాన్ని ఇంగ్లాండ్‌కు తరలిస్తున్న వలసవాదులను ఎదిరించి, తమ ప్రజలను కాపాడుకోవడానికి సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ చేసిన పోరాటమే ఈ సినిమా.

నటీనటుల విషయం చూస్తే.. సింగనమల బొబ్బిలి రణబాలి(Ranabaali)గా విజయ్ దేవరకొండ జీవించేశాడనే చెప్పొచ్చు. తన లుక్, కడప యాసతో మాట్లాడిన తీరు, కళ్లల్లో చూపించిన రౌద్రం తన ప్రీవియస్ మూవీలలో కంటే ఎంతో పరిణతి చెందిన యాక్షన్‌ను గుర్తు చేస్తాయి.

ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్న అయితే ఎమోషనల్ సీన్స్‌తో పాటు ఓవరాల్ మూవీలో చాలా హోమ్లీగా, అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. విజయ్, రష్మిక మధ్య ఉండే కెమిస్ట్రీ మరోసారి కూడా స్క్రీన్ పై చాలా ఫ్రెష్‌గా వర్కౌట్ అయింది. విలన్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో భయపెట్టగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రతీ సీన్‌లో విజువల్ రిచ్‌నెస్‌ను అందించాయి.

జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ అప్పటి కాలాన్ని ఆడియన్స్‌కు కళ్లకు కట్టినట్లు చూపించగా, ఎడిటర్ సెకండాఫ్‌లోని కొన్ని సాగతీత సీన్లను ట్రిమ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకా వేరేలా ఉండేదన్న ఫీలింగ్‌ను తీసుకువచ్చింది. అజయ్-అతుల్ పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మన నేటివిటీకి ఇంకాస్త సింక్ అవ్వాల్సి ఉంది.

మొత్తానికి ఎలాంటి అనవసరపు ఆర్భాటాలు లేకుండా ఒక నికార్సైన పీరియాడిక్ స్టోరీని చెప్పాలనుకున్న డైరెక్టర్ ప్రయత్నం, విజయ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం అలాగే పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ స్క్రీన్‌పైన కనిపించిన విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ కోసం , రణబాలి(Ranabaali)ని బిగ్ స్క్రీన్‌పై కచ్చితంగా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.

Jailer 2 : బాక్సాఫీస్ దగ్గర రజినీ మాస్ జాతర..రూ.100 కోట్లు దాటేసిన జైలర్ 2 ఫస్ట్ డే కలెక్షన్లు

Related Articles

Back to top button