Fire Accident : చార్మినార్ వద్ద ఫైర్ యాక్సిడెంట్..బాంబే హౌస్ అగ్నిప్రమాదం తర్వాత మళ్లీ తెరపైకి సేఫ్టీ చర్చ..
Fire Accident : నోటీసులతో సరిపెట్టకుండా, నిబంధనలు పాటించని వాణిజ్య సముదాయాలపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Fire Accident
చార్మినార్ మదీనా క్రాస్‌రోడ్డులో ఉన్న బాంబే హౌస్ బట్టల షాపులో తాజాగా జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident) మరోసారి సిటీ ప్రజలను, అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. మంటలతో పాటు చుట్టూ ఒక్కసారిగా పొగలను చూసి అక్కడివారు భయంతో పరుగులు తీశారు.
ఫైర్ ఇంజన్లు హుటాహుటిన వచ్చి సహాయక చర్యలు చేపట్టడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది. బిల్డింగ్ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించారా అంటూ అధికారులు ఎంక్వైరీ చేస్దున్నారు. అయితే ఇదంతా కేవలం ఒక రోజు లేదంటే వారం రోజుల ముచ్చటేనా? ఆ తర్వాత మళ్లీ ఎప్పట్లాగే అవే పాత పద్ధతులు, అవే నిబంధనల ఉల్లంఘనలపై వార్తలు రావడం మన వ్యవస్థలో కొన్నేళ్లుగా జరుగుతున్న తంతుగా మారిపోయింది.
హైదరాబాద్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు(Fire Accident) జరగడం కామన్ అయిపోయాయి. అంతేకాదు ఇలాంటి ప్రమాదాల జరిగినప్పుడు హడావుడి చేయడం,కమిటీలు వేయడం, నిబంధనలు కఠినతరం చేస్తామని ప్రకటనలు ఇవ్వడం నాయకులకు, అధికారులకు ఇంకా కామన్‌గా మారిపోయింది. మళ్లీ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనే రిపీట్ అయి ప్రాణాలు గాలిలో కలిసే వరకు ఈ నిర్లక్ష్య ధోరణి అలాగే కొనసాగుతూనే ఉంటుంది.
నిజానికి రద్దీగా ఉండే ప్రాంతాలలో వేల సంఖ్యలో దుకాణాలు, గోదాములు నివాస ప్రాంతాల మధ్యే కొనసాగుతున్నాయి. సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పాటు, ఒకే బిల్డింగ్‌లో టన్నుల కొద్దీ బట్టలను నిల్వ చేయడం, కనీస అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఫైర్ ఎగ్జిట్లు లేకపోవడం వంటి ఎన్నో లోపాలు ఇలాంటి బిల్డింగులలో క్లియర్‌గా కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. దీంతో నోటీసులతో సరిపెట్టకుండా, నిబంధనలు పాటించని వాణిజ్య సముదాయాలపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.





