Power Struggle In A Relationship : ప్రేమలో హనీమూన్ పీరియడ్ అయిపోయిందా? రిలేషన్షిప్లో వచ్చే పవర్ స్ట్రగుల్ అంటే ఏంటి?
Power Struggle In A Relationship : ప్రేమలో మొదటిలో ఉన్న ఉత్సాహం తగ్గిపోయి గొడవలు స్టార్ట్ అవడాన్నే పవర్ స్ట్రగుల్ దశ అంటారు. ఈ సమయంలో బంధాన్ని ఎలా కాపాడుకోవాలో ఓసారి చూద్దాం.
Power Struggle In A Relationship
ఏ రిలేషన్షిప్లోనైనా స్టార్టింగ్ అంతా ఎంతో అద్భుతంగా, మధురంగా ఉంటుంది. ఒకరిపై మరొకరికి ఉండే విపరీతమైన అట్రాక్షన్, ఇద్దరూ కలిసి గడిపే ప్రతి క్షణం లైఫ్‌ను ఎంతో ఉత్సాహంగా మారుస్తాయి. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ తొలి నాళ్ల ఉత్సాహం మెల్లగా తగ్గుముఖం పడుతుంది. ఇద్దరి మధ్య ఉన్న ఆలోచనల్లో తేడాలు, అలవాట్లలో తేడాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. రిలేషన్షిప్ జర్నీలో ఈ స్టేజ్‌ను సైకాలజిస్టులు అత్యంత కీలకమైన పవర్ స్ట్రగుల్(Power Struggle In A Relationship) దశగా చెబుతారు.
ఈ స్టేజ్‌లో ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. మొదట్లో పార్ట్నర్లో నచ్చిన ఆ చిన్న అలవాట్లే ఆ తర్వాత విపరీతమైన చికాకు తెప్పిస్తుంటాయి. పార్ట్నర్ మారాలని పద్ధతి మార్చుకోమని అవతలి వ్యక్తిని మార్చాలని ప్రయత్నించడం ఈ సమయంలోనే ఎక్కువగా జరుగుతుంది.
ఒకరి మాటను మరొకరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడం, ప్రతి చిన్న విషయానికి ఈగోలు అడ్డురావడం వల్ల రిలేషన్లో అభద్రతా భావం పెరుగుతుంది. దీంతోనే చాలామంది తమ మధ్య ప్రేమ తగ్గిపోయిందని.. ఇక కలిసి ప్రయాణించడం కష్టమనే అపోహతో విడిపోయే నిర్ణయాలు తీసుకుంటుంటారు.
అయితే రిలేషన్షిప్లో ఈ స్టేజ్ రావడమనేది లవ్ అంతం అయిపోయిందనడానికి సంకేతం కానే కాదు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలను ఓవర్ కమ్ చేసి నిజమైన పరిణతి సాధించడానికి ఇదొక అద్భుతమైన ఛాన్స్. ఈ టఫ్ టైమ్‌లో ఎలాంటి తప్పులు చేయకూడదో.. తమ మధ్య ఉన్న బంధాన్ని ఎలా కాపాడుకోవాలో గ్రహించడం చాలా అవసరమని సైకాలజిస్టులు చెబుతున్నారు.
సమస్య వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు తప్పు నీదే తప్పు నీదే అని అనుకోవడం మానేసి అసలు ఎక్కడ గ్యాప్ వస్తోందో ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. పార్ట్నర్ తన ఫీలింగ్స్‌ను వ్యక్తపరిచేటప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారి సైడ్‌ను నుంచి ఆలోచించడానికి ప్రయత్నించాలి.
ఎక్కడైనా సరే అభిప్రాయ భేదాలు రావడం కామన్ కాబట్టి వాటిని గౌరవిస్తూనే ఇద్దరూ కలిసి క్వాలిటీ టైమ్‌ను స్పెండ్ చేయడం ద్వారా తమ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవచ్చు. తప్పు ఎవరి వైపు ఉన్నా సరే సారీ చెప్పడం వల్ల ఆ రిలేషన్ మరింత బలపడుతుంది తప్ప ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోదు.
ఆఖరిగా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా సర్దుకుపోయే తత్వం ఉండాలి. అయితే ఎప్పుడూ అవమానాలు, అనుమానాలు, మానసిక వేధింపులు, శారీరక హింస వంటివి ఉంటే మాత్రం దానిని సాధారణ పవర్ స్ట్రగుల్ స్టేజ్‌గా(Power Struggle In A Relationship) ఎప్పటికీ అనుకోకూడదు. అలాంటి సందర్భాలలో మీ ఆత్మగౌరవానికి, మీ భద్రతకే ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి.





