Just Andhra PradeshLatest News

AP: మల్టీ మోడల్ కనెక్టివిటీకి సిద్ధం..లాజిస్టిక్స్ పవర్‌గా ఏపీ

AP:లాజిస్టిక్స్ కార్పొరేషన్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా సరకు రవాణా ప్రభావాన్ని పెంచనుంది.

AP

దేశ సరకు రవాణా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను ఒక లాజిస్టిక్స్ పవర్‌(logistics powe)గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని దేశ సరకు రవాణా రంగంలో కేంద్ర బిందువుగా నిలబెట్టేందుకు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, రోడ్లు, జల మార్గాల సమన్వయంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రణాళికలో మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్పొరేషన్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా సరకు రవాణా ప్రభావాన్ని పెంచనుంది. అన్ని రవాణా మార్గాల్లో సరకు చలనం సమన్వయంలో ఈ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.

కొత్తగా రూపొందించిన మారిటైం పాలసీలో షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు మార్గం తెరిచారు. మచిలీపట్నం, మూలపేట, చినగంజాం వంటి ప్రాంతాల్లో ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల స్థానిక మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, క్రూయిజ్ టెర్మినల్స్, కంటైనర్ పోర్టుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ప్రభుత్వం వల్ల తమిళనాడుకు తరలిపోయిన కంటైనర్ పోర్టును మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు కృషి జరుగుతోంది.

AP
AP

రాష్ట్రం(AP)లో 20 కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటితో పాటు కుప్పం, దగదర్తి ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి పోర్టు, ఎయిర్‌పోర్టు సమీపంలో ఎకనామిక్ హబ్‌లుగా పనిచేసేలా శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. MSME పార్కులకు దగ్గరలో కూడా టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఈ కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టులతో నేషనల్ హైవేలు, రైల్వేలు మరింత గాఢంగా అనుసంధానించబడతాయి. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు పొందేందుకు ప్రణాళికా ప్రకటనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఈ అన్ని ప్రణాళికల వల్ల ఆంధ్రప్రదేశ్ (AP) ఉత్తర, దక్షిణ భారతదేశాలకు సరకు రవాణా కేంద్రంగా మారనుంది. తక్కువ ఖర్చుతో, వేగంగా సరకు రవాణా సాధ్యమయ్యే మార్గాలను రూపొందించనున్నారు. ఏపీలో ప్రారంభించిన ఈ లాజిస్టిక్స్ కార్పొరేషన్ రాష్ట్రానికి ఒక “గ్రోత్ ఇంజిన్”గా పనిచేసి, ఆటోమేటిక్‌గా ఉపాధి అవకాశాలను, పెట్టుబడులను, పారిశ్రామిక అభివృద్ధిని పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయాలు రాష్ట్రాన్ని దేశ సరకు రవాణా మ్యాప్‌లో ఒక కేంద్ర బిందువుగా నిలిపే మార్గాన్ని సిద్ధం చేసేవే. ఈ అభివృద్ధి ప్రయాణం రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిని పూర్తిగా మలుపుతిప్పనుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button