Just InternationalJust PoliticalLatest News

Iran, Israel,US: ఇరాన్,ఇజ్రాయెల్,అమెరికా పోరులో కాలం కాలిపోతుందా? అధికార దాహానికి ప్రకృతి నాశనం తప్పదా?

Iran, Israel,US: క్షిపణులలో వాడే కెమికల్స్ నేల మీద పడిన చోటంతా, ఆ భూమి తన సారాన్ని పూర్తిగా కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది.

Iran, Israel,US

సాధారణంగా ఎక్కడైనా, ఏదైనా అనుకోని భూకంపాలు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు, అలాగే రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ప్రపంచం మొత్తం దానిపైనే చర్చిస్తుంది. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఎంత నష్టం జరిగింది, ఏ దేశం ఎక్కువ నష్టం జరిగిందన్న లెక్కలను వేసుకుంటారు.

ప్రకృతి వైపరీత్యాలు ఓకే కానీ.. యుద్ధం మాత్రం మనిషి తన సొంత చేతులతో తవ్వుకుంటున్న గొయ్యి అని తెలుసుకోలేకపోతున్నాడు. యుద్ధం అంటే కేవలం బాంబుల చప్పుడు, రక్తపు చారికలు మాత్రమే కాదు.. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భూమాత ప్రాణాలను తీసే ఒక భయంకరమైన కుట్ర జరుగుతుందని గుర్తించలేకపోతున్నాడు.

ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా(Iran, Israel,US) మధ్య జరుగుతున్న ఈ భీకర యుద్ధాన్ని చూస్తుంటే.. మనుషులు పగతో రగిలిపోతూ ప్రకృతిని నిలువునా దహనం చేసేస్తున్నారనిపిస్తోంది. యుద్ధం అంటే కేవలం ఒక దేశం గెలవడం కాదు, ప్రతీ మనిషికి ప్రాణవాయువునిచ్చే గాలిని విషంగా మార్చేయడం, దాహం తీర్చే నీటిని కలుషితం చేయడం .

ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలతో పాటు అక్కడి చమురు బావుల నుంచి వస్తున్న దట్టమైన నల్లటి పొగను దూరం నుంచి చూస్తుంటే.. ఆకాశం కన్నీరు పెడుతున్నట్లుగానే ఉంది. అంతేకాదు అక్కడ గాలిలో కలిసిన విషవాయువుల వల్ల..ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు శ్వాస తీసుకోవడం కూడా ఇప్పుడు జీవన మరణ పోరాటంలా మారిపోయింది.

అలాగే ఈ బాంబుల మోత వెనుక మరో భయంకరమైన నిజం దాగి ఉంది. ఈ క్షిపణులలో వాడే కెమికల్స్ నేల మీద పడిన చోటంతా, ఆ భూమి తన సారాన్ని పూర్తిగా కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. అంటే అక్కడ మరో యాభై ఏళ్ల వరకు చిన్న గడ్డిపోచ కూడా మొలవదు.

అంతేకాదు యుద్ధం వల్ల పర్షియన్ గల్ఫ్ సముద్రంలో కలిసిపోయిన.. ఆయిల్, విషపూరిత పదార్థాల వల్ల లక్షలాది మూగజీవాలు, చేపలు గిలగిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి. ఇక ఒకవేళ పొరపాటున ఈ దాడులు కనుక అణు కేంద్రాల వరకు పాకితే, ఆ రేడియేషన్ వల్ల పుట్టబోయే బిడ్డలంతా వికలాంగులుగా పుట్టే ప్రమాదం ఉందన్న విషయమే మర్చిపోతున్నారు. యుద్ధం చేసేవాళ్లు తమ గెలుపు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అంతే తప్ప తమ తర్వాతి తరం బతకడానికి స్వచ్ఛమైన భూమిని అందించాలన్న స్పృహ కోల్పోతున్నారు.

Iran, Israel,US
Iran, Israel,US

ఒకసారి కనుక చరిత్రను తిరగేస్తే వియత్నాం అడవులు కాలిపోవడం, ఇరాక్‌లో ఆకాశం నల్లగా మారిపోయిన రోజులు ఉన్నాయి. కానీ మనిషి తన గతాన్ని మర్చిపోయి మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా(Iran, Israel,US) యుద్ధం వల్ల వెలువడుతున్న ఈ హీట్ వల్ల ..మంచు కొండలు కరిగి, సముద్ర మట్టాలు పెరిగి, ఎక్కడో ఉన్న మన భారత దేశంపై కూడా వాతావరణ ప్రభావం పడుతుంది.

ఒకవేళ ఈ యుద్ధం ముగిసినా ఆ మచ్చలు మాత్రం మన భూమి మీద కొన్ని దశాబ్దాల పాటు అలానే ఉండిపోతాయి. ఈ భూమి మనందరిది. దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రాజ్య కాంక్ష, ఈగోలతో ట్రంప్‌లా రగిలిపోవడం కాదు.. ప్రేమతో, శాంతి చర్చలతోనే భూమాతను కాపాడాలి . యుద్ధం అంటే ఒక దేశం మీద దాడి కాదు.. భూమికి వేస్తున్న ఉరితాడు అని అని తెలుసుకోవాలి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button