Pen And Book Trend : డిజిటల్ యుగంలోనూ చేతిలో పెన్ను, అందమైన నోట్‌బుక్ ..ఈ ట్రెండ్ వెనుక ఉన్న సైకాలజీ రీజన్ ఏంటి?
Pen And Book Trend : డిజిటల్ యుగంలో కూడా ఖరీదైన పెన్నులు, నోట్బుక్లు వాడటం వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? చేతిరాతకు బ్రెయిన్‌కు ఉన్న సంబంధంపై ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Pen And Book Trend
చేతిలో మొబైల్, కళ్ల ముందు ల్యాప్‌టాప్ స్క్రీన్ మెరుస్తున్నా సరే, టేబుల్ మీద ఒక అందమైన నోట్‌బుక్, పాకెట్లో మంచి ఫౌంటైన్ పెన్నును వాడటాన్ని అలవాటు చేసుకుంటున్నారు చాలామంది. హృదయానికి హత్తుకునే ఆలోచనలు రావాలన్నా, కాలేజీ రోజుల్లోని డైరీ రాసే మూడ్ తీసుకురావాలన్నా ఆ కాగితం గలగలా శబ్దమే వేరే లెవెల్ కిక్ ఇస్తుంది.
టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా, యాప్స్ ఎన్ని పోటీ పడి వస్తున్నా కాగితం, పెన్ను మీద ప్రేమ మాత్రం అస్సలు తగ్గట్లేదు. దీని వెనుక కేవలం పాత అలవాటు ఒక్కటి మాత్రమే కాదు, మనిషి మనసును లోతుగా ప్రభావితం చేసే సాలిడ్ సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
సైకాలజీలో దీనికోసం స్పెషల్‌గా ఒక సిద్ధాంతమే ఉంది. ఫేమస్ సైకాలజిస్టులు రాబర్ట్ విక్‌లండ్, పీటర్ గొల్విట్జర్ ప్రతిపాదించిన సింబాలిక్ సెల్ఫ్ కంప్లీషన్ థియరీ ప్రకారం మనుషులు తమకు నచ్చిన గుర్తింపును కొన్ని వస్తువుల ద్వారా స్ట్రాంగ్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అంటే టేబుల్ మీద ఒక క్లాస్ట్లీ పెన్ను, బ్రాండెడ్ నోట్‌బుక్ పెట్టుకోవడం వల్ల తమను తాము ఒక ప్రొఫెషనల్ రైటర్‌గా, టేస్ట్ ఉన్న వ్యక్తిగా లేదా పక్కా ఆర్గనైజ్డ్ మనిషిగా సొసైటీకి చూపించుకోవడానికి ఇష్టపడతారు.
ఆ వస్తువులు వారికి ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ను ఇస్తాయి. కేవలం లుక్స్ మాత్రమే కాకుండా, బ్రెయిన్‌కు సంబంధించిన సైన్స్ కూడా దీనిలో దాగుంది. టోక్యో యూనివర్శిటీ రీసెర్చర్స్ జరిపిన ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో బిగ్ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ట్యాబ్లెట్లలో లేదా ఫోన్లలో కీబోర్డ్ మీద టైప్ చేయడానికి, రియల్ కాగితం మీద చేతితో రాయడానికి బ్రెయిన్ చాలా డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతుందని తేలింది. పేపర్ మీద చేతితో రాస్తున్నప్పుడు బ్రెయిన్లోని జ్ఞాపకశక్తి, లాంగ్వేజ్‌కు సంబంధించిన సెల్స్ సూపర్‌ఫాస్ట్‌గా, చాలా యాక్టివ్‌గా పనిచేస్తాయి.
టైప్ చేయడం కేవలం ఇన్ఫర్మేషన్ను ఫీడ్ చేయడం మాత్రమే అయితే, రాయడమనేది మైండ్‌ను లోతుగా ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రాసెస్. చిన్నప్పుడు రాసిన లెసన్స్ ఇప్పటికీ గుర్తున్నాయ్ కానీ మొన్న టైప్ చేసిన నోట్స్ మర్చిపోతుంటాం. వీటన్నింటికి తోడు ఆ పేపర్ మీద పెన్ను కదులుతున్నప్పుడు కలిగే టచ్ ఫీలింగ్, ఆ ఇంక్ స్మెల్ మనసుకు తెలీకుండానే ఒక మెంటల్ పీస్‌ను ఇస్తుంది. రోజంతా స్క్రీన్ చూసి మొబైల్ నోటిఫికేషన్లతో చిరాకు పడే మైండ్‌కి, ఈ పెన్ను కాగితం(Pen And Book Trend) జర్నీ ఒక బ్యూటిఫుల్ డిజిటల్ డిటాక్స్‌లా పని చేస్తుంది. ఇది టెక్నాలజీ మీద విరక్తితో చేసేది కాదు, మన మనసును మనం కంట్రోల్ చేసుకుంటూ కామ్‌గా బతకడానికి మన ఇష్ట ప్రకారం తీసుకునే ఒక కూల్ డెసిషన్ అంతే.
Monday Nominations : రచ్చ రచ్చ అయిన నామినేషన్ డే..చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ఊహించని ట్విస్ట్..





