Just SpiritualLatest News

Karthika Masam Festivals : కార్తీక మాసంలో వచ్చే పండుగలు.. డిసెంబర్ 8 వరకు ముఖ్యమైన తేదీలివే..

Karthika Masam Festivals : ప్రకారం కార్తీక మాసంలో రానున్న నాగుల చవితి, కార్తీక పౌర్ణమి అలాగే తులసి వివాహం వంటి ముఖ్యమైన పర్వదినాలు పూర్తి వివరాలు చూద్దాం.

Karthika Masam Festivals

తెలుగువారి లోగిళ్లలో పండుగ వాతావరణాన్ని, నెలంతా ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే కార్తీక మాసం(Karthika Masam Festivals) అంటే చాలామంది ఇష్టం. ఉదయాన్నే లేచి స్నానాలు, వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టడం, సాయంత్రం వేళ వెలిగే చిన్న దీపంతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

వరుస పూజలు, నోములు, భక్తిశ్రద్ధలతో కూడిన దీపారాధనలతో ఈ నెలంతా ప్రతి ఇంటా ఒక దివ్యమైన వాతావరణం నెలకొంటుంది. 2026 తెలుగు పంచాంగం ప్రకారం ఈ పవిత్రమైన నెలలో వచ్చే ప్రతి పర్వదినానికి ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన అఫీషియల్‌గా ప్రారంభమైన ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు రానున్నాయి.

నవంబర్ 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో నాగుల చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. పుట్టలో పాలు పోసి, నాగన్నను భక్తిశ్రద్ధలతో పూజించడం ఈరోజు ప్రత్యేకత. ఇక ఈ మాసమంతా పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారాలు నవంబర్ 16వ తేదీన, నవంబర్ 23వ తేదీన, నవంబర్ 30వ తేదీన , డిసెంబర్ 7 తేదీల్లో వరుసగా రావడం మహా విశేషంగా నిలుస్తాయి.

ఈ పవిత్ర సోమవారాలలో శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ, శివనామస్మరణతో మార్మోగిపోతాయి. అలాగే మధ్యలో నవంబర్ 20వ తేదీన దేవుత్థాన ఏకాదశి వేడుకలు రానుండగా, నవంబర్ 21తేదీన క్షీరాబ్ధి ద్వాదశి అలాగే తులసి వివాహం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. తులసి కోట వద్ద జరిగే ఈ కళ్యాణ వేడుకలు కనులవిందుగా ఉంటాయి.

ఇక నవంబర్ 23వ తేదీనన వైకుంఠ చతుర్దశి పర్వదినం రాగా, నవంబర్ 24వ తేదీన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న కార్తీక పౌర్ణమి ఘనంగా జరగనుంది. ఈ పౌర్ణమి రోజు ప్రతీ తెలుగు వారి ఇళ్లలోనూ, నదీ తీరాల్లోనూ, ఆలయాల్లోనూ నిర్వహించే దీపారాధనలు కనులవిందుగా నిలుస్తాయి.

ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీన మాసిక శివరాత్రి రాగా, డిసెంబర్ 8వ తేదీన కార్తీక అమావాస్యతో ఈ పవిత్ర మాసం ముగుస్తుంది. ఈ తేదీలన్నీ కూడా ఇంట్లో జరిగే పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ కార్తీక మాసం(Karthika Masam Festivals) తెచ్చే పాజిటివ్ పవర్ అందరి జీవితాల్లోనూ ఎప్పటికీ వెలుగులను నింపుతుంది.

Mogging : ఏంటీ మాగింగ్..సెలబ్రిటీల నుంచి యూత్ వరకూ ఎందుకింత ఫేమస్ అయింది?

Related Articles

Back to top button