Open Gym : రూపాయి ఫీజు లేదు,ట్రైనర్ అవసరమే లేదు.. ఫిట్‌నెస్ పెంచే ఓపెన్ జిమ్ మంత్ర..
Open Gym : చలికాలంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలనుకునే వారికి హైదరాబాద్‌లోని ఓపెన్ జిమ్‌లు బెస్ట్ ఆప్షన్. ఎటువంటి రుసుము లేకుండా బాడీని ఫుల్‌గా రీఛార్జ్ చేసుకునే ట్రెండీ వర్కవుట్ గైడ్ ..
Open Gym
వింటర్ వచ్చిందంటే చాలు బారెడు తెల్లవారినా కూడా దుప్పటి తన్ని పడుకోవాలనిపిస్తుంది. కానీ రియల్ ఫిట్‌నెస్ లవర్స్‌కు మాత్రం బాడీని పర్ఫెక్ట్ షేప్‌లోకి తెచ్చుకోవడానికి ఇదే రైట్ టైమ్ అంటున్నారు నిపుణులు. పొద్దున్నే పార్కుల్లోకి వెళ్తే చాలు జనాల సందడి, ఆ వైబ్స్ చూస్తుంటే మనలో లేని ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.
ముఖ్యంగా ఇటీవల చుట్టుపక్కల ఉండే పార్కుల్లో ఇప్పుడు ఎలాంటి జిమ్ ఫీజులు లేకుండా.. ఫుల్ బాడీ వర్కవుట్ చేసుకునే ఓపెన్ జిమ్(Open Gym)లు అందుబాటులోకి వచ్చేశాయి. భారీ బరువులు ఎత్తాల్సిన పనిలేకుండా, మన బాడీ వెయిట్‌తోనే కండరాలను గట్టిగా మార్చేసే అద్భుతమైన పరికరాలు ఉంటున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లో సుమారు 200కు పైగా పార్కుల్లో జీహెచ్ఎంసీ ఈ ఓపెన్ జిమ్(Open Gym)లను రన్ చేస్తోంది. లోకల్ మేనేజ్మెంట్ కూడా వీటిని చాలావరకూ బాగానే మెయింటెన్ చేస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ సొసైటీలు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పార్కులలో కూడా రకరకాల పరికరాలను ఉంచారు.
మనకు వర్కవుట్ చేయాలనే మైండ్ సెట్ ఉంటే చాలు మన ఇంటి పక్కనే ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లు, మహిళలు ట్రైనర్ సాయం లేకుండానే చాలా ఈజీగా ఎక్సర్‌సైజులు పూర్తి చేయొచ్చు. కార్డియో, బ్రీథింగ్, ఫ్లెక్సిబిలిటీ అన్నింటికీ కూడా ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. కొన్ని పార్కుల్లో అయితే జస్ట్ నామమాత్రపు ఛార్జీలతో సైక్లింగ్, కయాకింగ్ వంటి అడ్వెంచర్లు కూడా ఉంటున్నాయి.
అయితే ఈ ఓపెన్ జిమ్‌లు వాడేటప్పుడు కొన్ని పనులు చేయాలని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక్కడ ఉండే ఎయిర్ వాకర్స్, ట్విస్టర్స్, షోల్డర్ వీల్స్, చెస్ట్ ప్రెస్సులు వాడటం ఈజీ అయినా, అవి ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసే ముందు అవి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
అక్కడ ఈజీగా కనిపిస్తున్నాయి కదా అని ఫ్రీగానే వాడుతున్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు తిప్పేయకుండా, ఆల్రెడీ వాడుతున్న వాళ్లను అడిగి టెక్నిక్ తెలుసుకోవాలి. వర్కవుట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా దాని కంటే ముందు ఒక ఐదు నిమిషాలు లైట్ వార్మప్ చేశాకే.. ఆ తర్వాత నెమ్మదిగా స్పీడ్ పెంచాలి.
ఫస్ట్ రోజే ఓవర్‌గా చేయాలని ఆరాటపడితే మర్నాడే నడవలేని పరిస్థితి వస్తుంది. అలాగే మెడ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్లు నిపుణుల సలహా తీసుకున్నాకే వీటిని వాడాలి. చిన్న పిల్లలను ఈ హెవీ ఐరన్ వీల్స్ దగ్గరకు వెళ్లనివ్వకుండా పేరెంట్స్ జాగ్రత్త పడాలి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే పైసా ఖర్చు లేకుండా మీరు ఫిట్‌నెస్ స్టార్ అయిపోవచ్చు.
MS Dhoni : ఒక శకం ముగిసింది..కానీ బంధం మారలేదు..సీఎస్‌కే ప్లేయర్‌గా ధోని గుడ్‌బై..





