Just BusinessJust NationalLatest News

Gold Price :గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు..

Gold Price : గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా మెయిన్ సిటీలలో ఈరోజు 22 మరియు 24 క్యారెట్ల పసిడి రేట్ల పూర్తి చూడండి.

Gold Price

ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలు డైరెక్టుగా మన దేశంలోని పసిడి మార్కెట్‌పై ప చూపుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన వాతావరణం, అమెరికన్ డాలర్ విలువ మెల్లగా బలపడటంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల అప్ అండ్ డౌన్స్ అవుతున్న పసిడి ధరలతో టెన్షన్ పడుతున్న సామాన్య కొనుగోలుదారులకు మరోసారి కూడా ఈ స్వల్ప క్షీణత కొంతవరకు ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. దేశంలోని ముఖ్యమైన నగరాలన్నింటిలోనూ ధరలు సుమారు ఇదే బాటలో పయనించారయి.

జాతీయ బులియన్ మార్కెట్ గణాంకాల ప్రకారం.. 24 క్యారెట్ల ప్యూరిటీ కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర(Gold Price) సుమారు రూ. 1లక్ష34వేల 840 వద్ద కొనసాగుతుండగా, జ్యువెలరీ తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) రూ. 1లక్ష23వేల869 వద్ద నిలిచింది. ఇక మార్కెట్లో వెండి ధర కూడా ఇదే బాటలో నడిచి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. 999 ప్యూరిటీ కలిగిన కేజీ సిల్వర్ ధర రూ. 1లక్ష70వేల340 వద్ద ట్రేడవుతోంది.

భారతీయ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) లెక్కల ప్రకారం, 999 ప్యూరిటీ గోల్డ్ 10 గ్రాములపై సుమారు రూ. 770 తగ్గి రూ. 1లక్ష34వేల201 వద్ద ముగిసింది. అలాగే 916 ప్యూరిటీ కలిగిన పుత్తడి రూ. 705 క్షీణించి రూ. 1లక్ష22వేల928 వద్ద ట్రేడ్ అయింది. రిటైల్ మార్కెట్‌లోని ప్రముఖ బ్రాండ్ల విషయానికి వస్తే.. తనిష్క్ సంస్థ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధరను రూ. 12,520గా ఫిక్స్ చేయగా, కళ్యాణ్ జ్యువెలర్స్ రూ. 12,470గా విక్రయిస్తున్నాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ట్రేడింగ్‌లో డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ 0.23 శాతం నష్టంతో రూ. 1లక్ష34వేల223 వద్ద క్లోజ్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌లో కామెక్స్ పుత్తడి 1.19 శాతం క్షీణించి ఔన్సుకు 3,818.10 డాలర్ల వద్ద కదులుతోంది.

సిటీల వారీగా చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేట్ రూ. 1లక్ష34వేల810 ఉండగా, ముంబైలో రూ. 1లక్ష34వేల600, ఢిల్లీలో రూ. 1లక్ష34వేల360, చెన్నైలో రూ. 1లక్ష34వేల990 వద్ద ఉన్నాయి. అయితే లోకల్ వ్యాపారులు వేసే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలను బట్టి కూడా వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు మారుతుంటాయని గుర్తుంచుకోవాలి.

Children Mistakes : మీ పిల్లలు తప్పులు చేస్తున్నారా?.. ముందు పేరెంట్స్ చెక్ చేసుకోవాల్సిన 7 అలవాట్లు ఇవే

Related Articles

Back to top button