Just EntertainmentLatest News

KAAKA : చిరు లీక్స్ మళ్లీ స్టార్ట్.. కాకా సినిమాలో అనస్వర పాత్రపై హింట్..

KAAKA : మెగాస్టార్ చిరంజీవి 'ఇట్లు అర్జున' సక్సెస్ మీట్‌లో చేసిన కామెంట్లు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా 'కాకా' సినిమాలో అనస్వర రాజన్ పాత్రపై చిరు ఇచ్చిన హింట్ ఏంటి?

KAAKA

మెగాస్టార్ చిరంజీవి ఏ వేదికపై మాట్లాడినా అక్కడ నవ్వులు పూయడం ఖాయమన్న విషయం ఆయన ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. అయితే ఆయన మాటల్లో సినిమా రహస్యాలు కూడా అంతే జోష్‌లో అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అందుకే అభిమానులే కాదు మెగాస్టార్ కూడా సరదాగా వాటిని ‘చిరు లీక్స్’ అని పిలుస్తుంటారు.

తాజాగా ఓ సినిమా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాంటి చర్చకే కారణమయ్యాయి. ముఖ్యంగా బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాలో అనస్వర రాజన్ పాత్ర గురించి చిరు ఇచ్చిన హింట్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో కాకా(KAAKA) అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో అంచనాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇటీవల ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి, అనస్వర నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. అదే సమయంలో ఆమె ‘కాకా’ మూవీలో చేస్తున్న రోల్‌ గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అనస్వరను మాట్లాడమని అడిగిన చిరు.. ఆమె మాట్లాడదంటూ వెంటనే చెప్పేశారు. . అంతేకాదు, తాను చెప్పిన ఈ చిన్న మాటను ఇంటికి వెళ్లాక అందరూ ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుందని ట్విస్ట్ ఇచ్చారు.

చిరంజీవి చేసిన ఈ కామెంట్‌తో అక్కడున్నవారిలో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఆ టైమ్‌లో అనస్వర ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్ కూడా ఈ సందర్భాన్ని మరింత సరదాగా మార్చింది. ఇక ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తమ అంచనాలు మొదలుపెట్టారు. చిరు మాటలను బట్టి చూస్తే ‘కాకా'(KAAKA) సినిమాలో అనస్వర మాటలు రాని అమ్మాయి పాత్రలో కనిపించబోతుందని మెగాస్టార్ చిరు లీక్స్ ద్వారా చెప్పేశారా అనే చర్చ నడుస్తోంది.

అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి వ్యాఖ్యలను బట్టి అభిమానులు ఒక అంచనాకు వచ్చినా, పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా ప్రమోషన్లలో మరిన్ని విషయాలు వెల్లడయ్యే వరకు వేచి చూడాలి.

ఇదే వేడుకలో యాంకర్ స్రవంతితో కూడా చిరంజీవి ఓ ఆట ఆడుకున్నారు. తనను ఎక్కువ ప్రశ్నలు అడగొద్దని, ఏం చెబుతానో తనకే తెలీకుండా సినిమా విషయాలు బయటపడిపోతాయంటూ తనమీద తనే జోక్ వేసుకుని నవ్వించారు.

చిరంజీవి ఇలా సరదాగా మాట్లాడుతూనే తన మూవీపై ఆసక్తిని పెంచడం అభిమానులకు కొత్తేమీ కాదు. చిరు చెప్పిన చిన్న మాటల ఆధారంగా సినిమా కథ, పాత్రల గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతుంటాయి. ఈసారి కూడా ‘కాకా’లో అనస్వర పాత్రపై కూడా అదే జరుగుతోంది.

బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్‌తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలకు కూడా మూవీలో ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి చిరంజీవి చేసిన ఒక్క చిన్న కామెంట్ ‘కాకా’ సినిమాపై మరోసారి చర్చను మొదలుపెట్టింది. అనస్వర రూల్‌ నిజంగానే మాటలు రాని అమ్మాయిదేనా? చిరు లీక్స్ వెనుక ఇంకేమైనా ప్రత్యేకత ఉందా? అనేది మూవీ రిలీజయ్యే వరకు ఆసక్తికరంగానే ఉండనుంది.

Hyderabad IMAX : ఐమ్యాక్స్ గ్రాండ్ రీ-ఎంట్రీ..11 ఏళ్ల తర్వాత హైదరాబాదీలకు పండుగే..

Related Articles

Back to top button