Just LifestyleLatest News

Opportunists : మీ చుట్టూ ఉన్న అవకాశవాదులను ఇట్టే గుర్తించడం ఎలా? ఈ సైకలాజికల్ ట్రిక్స్ తెలుసుకోండి

Opportunists : అవకాశవాదులు ఎలా ప్రవర్తిస్తారు? ఏ గాలికి ఆ కబురు చెప్పే ఈ డ్యూయల్ నేచర్ వ్యక్తుల మనస్తత్వం, వారి వెనుక ఉండే సైకాలజీ ఏంటి?

Opportunists

పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు కూడా మీ వెన్నంటి ఉంటారు. కానీ కష్టం వస్తే కనీసం నీడ కూడా కనిపించనీకుండా మాయమైపోతారు. అవసరమున్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడి, పని అయిపోయాక ముఖం చాటేసే మైండ్ సెట్ ఉన్నవారిని మనం చాలామందినే చూస్తుంటాం. ఇలాంటి అవకాశవాదులు (Opportunists) చూడటానికి అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు కానీ.. వీళ్ల ప్రవర్తన వెనుక పక్కా స్వార్థపూరితమైన సైకాలజీ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఈ అవకాశవాదుల ప్రధాన లక్షణం సిట్యుయేషనల్ లాయల్టీ అంటే సందర్భాన్ని బట్టి మారే విశ్వాసం అన్నమాట. వీళ్లకు ఏ బంధం మీదో, సిద్ధాంతం మీదో ఎలాంటి ప్రేమ కూడా ఉండదు. ఎవరి ద్వారా తమకు పని జరుగుతుంది, ఎవరితో ఉంటే లాభం వస్తుందనే లెక్కలు వేసుకోవడంలో వీరు బాగా ఆరితేరి ఉంటారు. ఇటువైపు ఉన్నప్పుడు మనల్ని పొగుడుతూనే.. అవసరమైతే అవతలి పక్షంతో వారి స్వంత పనులు అయ్యేలా చేసుకోవడానికి తెరవెనుక పావులు కదుపుతుంటారు.

సైకాలజీ పరంగా చూస్తే, వీళ్లలో డీప్ ఇన్సెక్యూరిటీ అంటే తీవ్రమైన అభద్రతాభావంతో పాటు ఎప్పుడూ వాళ్లే అన్ని విషయాలలో గెలవాలనే తపన ఉంటాయి. ఎప్పుడైనా తాను ఒంటరి అయిపోతాననే భయం వల్ల.. అన్ని వైపులా తమ సంబంధాలను అమ్ముకోవడానికి రెడీ అయిపోతుంటారు. ఇతరుల భావోద్వేగాలతో వీళ్లకేమీ సంబంధం ఉండదు.. కేవలం తమ స్వార్థమే పరమావధి అన్నట్లు ప్రవర్తిస్తుంటారు.

అయితే, ఇలాంటి వ్యక్తుల బుద్ధి ఎక్కువ కాలం దాగి ఉండదు. ఒకసారయినా వీరి మోసం బయటపడితే ఆ తర్వాత ఎవరూ వీళ్లను నమ్మరు. టెంపరరీగా వీరు అన్ని దారుల్లో కూడా లాభపడినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో నిజమైన ఆప్యాయతలను, శాశ్వతమైన బంధాలను పూర్తిగా కోల్పోతారు. అవసరం కోసమే తమతో ఇలా ఉంటున్నారని తెలిసిన మరుక్షణం వారిని దూరం పెడతారు. నమ్మకం పునాదిగా లేని ఏ రిలేషన్ కూడా ఎక్కువ కాలం నిలవదు కాబట్టి, అవకాశవాద బతుకులు ఎప్పటికీ కూడా చివరకు ఒంటరిగానే మిగులుతాయన్నవిషయం అర్థం చేసుకోవాలి.

Diabetes : స్వీట్ తింటే షుగర్ పెరగడం కాదు..సరిగ్గా నిద్రపోకపోయినా కూడా డేంజరే..

Related Articles

Back to top button