Just TelanganaJust PoliticalLatest News

Revanth Reddy Love Story : రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ.. ఢిల్లీకి వెళ్లి మరీ పెళ్లికి ఒప్పించిన రేవంత్ రెడ్డి..

Revanth Reddy Love Story : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం 1,750 కి.మీ. బైక్‌పై ఢిల్లీ వెళ్లిన పెళ్లి జర్నీ వైరల్ అవుతోంది..

Revanth Reddy Love Story

పాలిటిక్స్‌లో ప్రత్యర్థులపై తనదైన స్టైల్‌లో పదునైన విమర్శలు.. సభల్లో ఏ మాత్రం దూకుడు తగ్గని ప్రసంగాలు.. నిర్ణయం తీసుకుంటే పని అయ్యేవరకూ కనిపించే అదే పట్టుదల.. ఇవే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి చాలామందికి తెలిసిన విషయాలు. కానీ ఆయన జీవితంలో రాజకీయాలకు అతీతంగా ఒక అందమైన లవ్ స్టోరీ కూడా ఉంది.

ప్రేమించిన అమ్మాయిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనే సంకల్పంతో ఏకంగా 1,750 కి.మీ. బైక్‌పై ప్రయాణించి మరీ ఢిల్లీకి కూడా వెళ్లారట. ఇది వినడానికి సినిమా స్టోరీలా అనిపించినా.. తన లైఫ్‌లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటనను రేవంత్‌రెడ్డి స్వయంగా వెల్లడించారు.

ఆరోజుల్లో రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి ప్రేమకథకు నాగార్జున సాగర్ వేదిక అయిందట. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద బోటు ప్రయాణం చేస్తుండగా గీతారెడ్డిని తొలిసారి చూశారు. అలా అప్పుడు పెంచుకున్న పరిచయం మెల్లగా స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమగా రూపాంతరం చెందింది. ఇద్దరి మధ్య బంధం బలపడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

అయితే ప్రేమించినంత ఈజీగా పెళ్లి చేసుకోవడం మాత్రం సాధ్యం కాలేదట. రెండు కుటుంబాల మధ్య ఉన్న పొలిటికల్ నేపథ్యాలు, అభిప్రాయ భేదాలు వీరి పెళ్లికి అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా గీతారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పెళ్లికి అంగీకరించలేదని రేవంత్‌ రెడ్డి వెల్లడించారట.

వీరి పెళ్లికి ఫ్యామిలీ నుంచి అంగీకారం రాకపోవడంతో గీతారెడ్డిని ఆమె పెద్దనాన్న, అప్పటి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్. జైపాల్‌రెడ్డి వద్దకు ఢిల్లీకి పంపించేశారు. దీంతో వారి లవ్ స్టోరీలో కీలక మలుపు మొదలైంది. ప్రేమించిన అమ్మాయి దూరంగా ఉందని డిజప్పాయింట్ అవకుండా, ఆమెను కలవడంతో పాటు కుటుంబంలోని పెద్దలను ఒప్పించాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చారు.

అప్పట్లో ఇప్పటిలా ఈజీగా ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. సుమారు 1,750 కిలోమీటర్ల దూరాన్ని బైక్‌పైన ప్రయాణించి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ గీతారెడ్డిని కలవడంతో పాటు జైపాల్‌రెడ్డితో మాట్లాడి తన ప్రేమ గురించి, పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని వివరించారు.

రేవంత్‌రెడ్డి పట్టుదల, తన డెసిషన్ పట్ల ఉన్న నమ్మకాన్ని వివరించడంతో చివరకు పెద్దల అంగీకారం లభించింది. అలా రెండు కుటుంబాల మధ్య ఉన్న అభ్యంతరాలను అధిగమించి రేవంత్ రెడ్డి, గీతా రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. 1992 మే 7న రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి వివాహం జరిగింది.

తాజాగా నాగార్జునసాగర్ పరిసరాల్లో జరిగిన వరుణ యాగంలో భార్యతో కలిసి పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం మొదలైన తమ పరిచయం, ప్రేమ, పెళ్లి కోసం చేసిన ప్రయత్నాలను వివరించడంతో ఈ లవ్ స్టోరీ మరోసారి చర్చనీయాంశమైంది.

పొలిటికల్ లైఫ్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న రేవంత్‌రెడ్డి పర్సనల్‌ లైఫ్‌లోనూ తన ప్రేమ కోసం అంతే పట్టుదల చూపించారనే విషయం ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటోంది. 1,750 కి.మీ. బైక్ ప్రయాణం.. ఒక ప్రేమను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నం.. వెరసి సీఎం ప్రేమకథ(Revanth Reddy Love Story) ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

Gold Prices Fall Down : కంటిన్యూయస్‌గా దిగివస్తున్న బంగారం..రికార్డు గరిష్టాల నుంచి తగ్గుముఖం

Related Articles

Back to top button