Just SpiritualLatest News

Karthika Pournami : కార్తీక పౌర్ణమి స్పెషల్..ఈరోజు 27 నక్షత్ర దీపాలు వెలిగిస్తే ఏమవుతుంది?

Karthika Pournami : కార్తీక పౌర్ణమి రోజు 27 నక్షత్రాల పేరిట దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకోండి. పూజా విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలేంటి?

Karthika Pournami

కార్తీక మాసం నెల వస్తుందంటేనే ఆలయాలలో దీపాల కాంతులు, గుమ్మం ముందు ప్రమిదల వరుసలు, ఎటు చూసినా శివనామస్మరణతో వాతావరణమంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంది. ఇక ఏడాదిలో ఎంతో విశిష్టమైన కార్తీక పౌర్ణమి వస్తే ఆ ఆధ్యాత్మిక సందడి ఇంకా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ పవిత్రమైన పౌర్ణమి(Karthika Pournami) రోజు దీపం వెలిగించడానికి మన హిందూ సంప్రదాయంలో చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది. అలాంటి విశేషమైన పున్నమి సమయలో, ఏకంగా 27 నక్షత్రాల పేరుతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని.. ఈ ఆచారం వెనుక ఆధ్యాత్మిక అర్థం ఉందని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకాశంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రంతో మొదలై రేవతి నక్షత్రం వరకు ఉన్న ప్రతి నక్షత్రానికి కూడా దానిదైన ప్రత్యేకత ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు ఈ 27 నక్షత్రాలను భక్తితో మనసులో తలుచుకుంటూ, ఒక్కో నక్షత్రానికి గుర్తుగా ఒక్కో దీపం చొప్పున మొత్తం 27 ప్రమిదలను వెలిగించడం ఒక ప్రత్యేకమైన పద్ధతిగా పెద్దలు చెబుతారు. అంటే ఒక్కో దీపాన్ని ఒక్కో నక్షత్రంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి పెరిగి, సుఖశాంతులు నిండుతాయని భక్తులు నమ్ముతారు. దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ మంచి జరగడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి మనసుకు ప్రశాంతత దక్కుతుందని ఆ శివుడిని వేడుకుంటారు.

కార్తీక పౌర్ణమి(Karthika Pournami)రోజు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని.. ఆ తర్వాత పూజ గదిలో లేదా తులసి కోట వద్ద శుభ్రమైన చోట 27 మట్టి ప్రమిదలను ఒకదాని తర్వా ఒకటి పేర్చుకోవాలి. ఆ ప్రమిదలలో నువ్వుల నూనె గానీ, ఆవు నెయ్యి గానీ పోసి ఒత్తులు వేయాలి. హరిహరమహాదేవుళ్లతో పాటు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఒక్కో దీపాన్ని వెలిగిస్తూ, శివనామస్మరణ చేస్తూ ఇంట్లో వాళ్లంతా కలిసి ఈ పూజను చేసుకోవచ్చు.

ఒకవేళ 27 దీపాలను వెలిగించడం ఎవరికైనా వీలు కాకపోతే కంగారు పడాల్సిన పని లేదు. పరమ శివుడికి భక్తితో వీలైనన్ని దీపాలతో మనసారా పూజ చేసుకున్నా సరిపోతుంది. దీపాల సంఖ్య కంటే మనం పెట్టే భక్తి, శ్రద్ధలతో మనసారా పెట్టే దీపాలే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తంగా హిందూ సంప్రదాయం, భక్తి కలిసిన ఈ 27 నక్షత్ర దీపారాధనతో ఈ కార్తీక పౌర్ణమి రోజు మీ ఇంట్లో వెలుగులు నింపి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులవ్వండి

After Retirement : 60 ఏళ్లు దాటినా ఆగని జోష్.. ఉద్యోగానికే రిటైర్మెంట్, అనుభవానికేం కాదు..

Related Articles

Back to top button