Gold Spot Cool Drink : 26 ఏళ్ల తర్వాత గోల్డ్ స్పాట్ రీ-ఎంట్రీ..రిలయన్స్ క్యాంపాకు చెక్ పెట్టడానికేనా?
Gold Spot Cool Drink : 26 ఏళ్ల గ్యాప్ తర్వాత గోల్డ్ స్పాట్ రీ-లాంచ్ అవుతోంది. క్యాంపా పోటీని ఎదుర్కోవడానికి కోకా కోలా తీసుకున్న నిర్ణయం, బెవరేజెస్ మార్కెట్ అంచనాలను నిజం చేస్తుందా?
Gold Spot Cool Drink
ఒకప్పుడు ఆరెంజ్ సాఫ్ట్ డ్రింక్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే స్వదేశీ బ్రాండ్ గోల్డ్ స్పాట్. అందరికీ హాట్ ఫేవరేట్ కూల్ డ్రింక్ అయినా కూడా గోల్డ్ స్టాట్ . దాదాపు 26 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. నేటి తరం జనం హెల్త్, షుగర్ విషయంలో జాగ్రత్తగా ఉంటుండటంతో.. ఈసారి లో-షుగర్ లేదంటే కంప్లీట్ షుగర్ ఫ్రీ వేరియంట్లలో దీన్ని రీ లాంచ్ చేయాలని కోకా-కోలా ప్లాన్ చేస్తోంది.
దీనిపై త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ రావొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పాత తరానికి నాస్టాల్జియా ఫీలింగ్ కలిగించేలా ది జింగ్ థింగ్ ట్యాగ్‌లైన్‌ను కూడా కొనసాగించే ఆలోచనలో సంస్థ ఉంది.
1971లో మొదలైన గోల్డ్ స్పాట్ బ్రాండ్‌ను 1993లో థమ్స్ అప్, లిమ్కా, మాజాతో పాటు కోకా కోలా కొనుగోలు చేసింది. ఆ తర్వాత తన సొంత ఆరెంజ్ డ్రింక్ ..ఫాంటా కూల్ డ్రింక్కే ఇది పోటీగా మారడంతో 2000లో గోల్డ్ స్పాట్ సేల్స్‌ను ఆపేసింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. మార్కెట్లో రిలయన్స్ క్యాంపా బ్రాండ్ నుంచి గట్టిగా పోటీ ఎదురవుతూ ఉండటంతో.. తమ షేర్‌ను నిలబెట్టుకోవడానికి కోకా-కోలా ఓల్డ్ బ్రాండ్‌ను మళ్లీ బయటకు తీస్తోంది.
భారతీయ నాన్-ఆల్కహాలిక్ బెవరేజెస్ మార్కెట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.40 లక్షల కోట్ల రూపాయలు వద్ద ఉండగా, 2030-31 నాటికి 2.56 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. ఇంత పెద్ద మార్కెట్లో తన పట్టును మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి కోకా కోలా వేసిన ఈ ఎత్తుగడ ఇంట్రస్ట్ రేపుతోంది.
కాగా ఈ రీ-లాంచ్ సమయంలో సోషల్ మీడియాలో ఒక ఇంట్రస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఫోటోతో ముద్రించి ఉన్న గోల్డ్ స్పాట్ క్యాన్‌ను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో గోల్డ్ స్పాట్‌కు ధోనీనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారేమో అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధోనీ ఈ బ్రాండ్‌తో యాడ్ అయితే,గోల్డ్ స్పాట్ రీ ఎంట్రీకి మరింత బూస్ట్ లభించినట్లేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
View this post on Instagram
Dopamine Trap : పొద్దున్నే ఫోన్ చూసి డే స్టార్ట్ చేస్తున్నారా? డోపమైన్ ట్రాప్ నుంచి ఇలా బయటపడండి..





