Bigg BossJust EntertainmentLatest News

Final Captain : బిగ్ బాస్ 10 ఫైనల్ కెప్టెన్‌గా దేబ్జానీ.. ఆర్కేకు షాక్ ఇచ్చిన ఆర్పీ..

Final Captain : బిగ్ బాస్ సీజన్ 10 చివరి కెప్టెన్‌గా దేబ్జానీ సెలక్ట్ అయింది. క్యాండీ టాస్క్, ఆర్పీ సంచాలక్ నిర్ణయం, త్రిగుణ్,వర్షిణి మధ్య క్యారెక్టర్ లెస్ గొడవతో హౌస్ ఫుల్ హీటెక్కింది.

Final Captain

బిగ్ బాస్ సీజన్ 10లో ఫినాలేకి కౌంట్ డౌన్ టైమ్ దగ్గరపడుతున్న సమయంలో చివరి కెప్టెన్సీ పోరు హౌస్‌ను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ సీజన్‌కు ఫైనల్ కెప్టెన్‌(Final Captain)గా దేబ్జానీ నిలిచింది. రాం ప్రసాద్, త్రిగుణ్, వంశీ, అమన్, నరేష్ అందరూ దేబ్జానీకే సపోర్ట్‌గా నిలబడ్డారు. దాంతో చివరి దశలో రామకృష్ణను పక్కన పెట్టేసి దేబ్జానీని కెప్టెన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఇటు గేమ్ చివరి స్టేజ్‌కి చేరుకునే కొద్దీ ఎవరి గ్రూపులు వారివే అన్నట్టుగా హౌస్‌లో ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇదే సమయంలో వర్షిణి, త్రిగుణ్ మధ్య పాత గొడవలు మళ్లీ రేగడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.

పన్నెండో వారంలో జరిగిన బడ్డీ అప్ థీమ్‌లో ఆర్కే, శివ్, దేబ్జానీ, సుధీర్, నరేష్, అమన్ కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీలోకి దిగారు. మిగిలిన వారిలో మరో నలుగురికి అవకాశం ఇస్తానని బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. త్రిగుణ్, వంశీ, ఆర్పీ కలిసి ముకేష్‌తో ఆడదామని ప్లాన్ వేయగా.. ముకేష్, వర్షిణి మాత్రం త్రిగుణ్‌ను తప్పించడానికి చూశారు. వర్షిణి తనకు సారీ చెబితే ఓటు మారుస్తానని త్రిగుణ్ కండీషన్ పెట్టడంతో, పాత క్యారెక్టర్ లెస్, తొక్కేయడం వంటి మాటలపై వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. త్రిగుణ్ తనను క్యారెక్టర్ లెస్ అన్నాడని వర్షిణి వాదిస్తే, వర్షిణి కూడా తనను తొక్కేయాలని ఎన్నో మాటలు అన్నాదంటూ త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు.

నేను ఎవరితో తిరిగానని నా క్యారెక్టర్ గురించి అలా అంటావంటూ వర్షిణి కన్నీళ్లు పెట్టుకోవడం హౌస్‌లో అందరినీ కదిలించింది. నువ్వు అలా అనలేదని వంశీ, ఆర్పీ, శివ్.. త్రిగుణ్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఆవేశంలో ఏదేదో మాట్లాడేస్తున్నావని, కాస్త కంట్రోల్ చేసుకోవాలని ముకేష్ కూడా వర్షిణికి సూచించాడు. ఆ తర్వాత వర్షిణి గేమ్ నుంచి పక్కకు తప్పుకోగా, రాం ప్రసాద్, వంశీ, ముకేష్, త్రిగుణ్ ఆడారు. త్రిగుణ్‌ను అడ్డుకునేలా ముకేష్ ఆడాడు. చివరికి రాం ప్రసాద్ విజేతగా నిలిచాడు.

ఇక ఫైనల్ కెప్టెన్సీ టాస్క్‌లో ఫస్ట్ త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించాడు. క్యాండీ షాప్‌లో క్యాండీలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటూనే, సపోర్టర్లు క్యాండీలు ఎంచుకుని తమ బాక్సుల్లో వేయడం ఈ టాస్క్. మొదటి రౌండ్‌లో శివ్ అవుట్ కాగా, అమన్ బాక్స్‌ను త్రిగుణ్ ఎత్తి పడేయడంతో.. సెకండ్ రౌండ్ సంచాలక్ అయిన శివ్ అతన్ని డిస్‌క్వాలిఫై చేశాడు. థర్డ్ రౌండ్‌కు అమన్ సంచాలక్‌గా ఉండగా సుధీర్ అవుట్ అయ్యాడు. తర్వాత సుధీర్ సంచాలక్‌గా వ్యవహరించిన ఫోర్త్ రౌండ్‌లో ఆర్పీ, నరేష్ బయటకు వెళ్లారు. ఫైనల్ రౌండ్‌కు సంచాలక్‌గా వచ్చిన రాంప్రసాద్ అసలు ఫిజికల్ కాకూడదని కండీషన్ పెట్టగా, రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

అప్పటికే దేబ్జానీని కెప్టెన్ చేయాలని మిగిలిన వారు ఫిక్స్ అయిపోవడంతో ఆర్పీ ఇలాంటి కండీషన్ పెట్టాడనే చర్చ నడిచింది. చివరకు క్యాండీలు లెక్కపెట్టకండానే ఆర్కేను పక్కన పెట్టి దేబ్జానీని కెప్టెన్‌గా రాంప్రసాద్ ప్రకటించేశాడు. మెజారిటీ నెంబర్ దేబ్జానీ వాళ్ల వైపు ఉండటంతో వాళ్లు అనుకున్నదే జరిగిందని శివ్ అనగా ఆర్కే పరిస్థితి పాపం అనిపించేలా తయారయింది. మొత్తంగా అన్ని ట్విస్ట్‌ల మధ్య దేబ్జానీ సీజన్ 10 చివరి కెప్టెన్‌(Final Captain)గా నిలవడం హౌస్‌లో కొత్త మలుపులకు దారి తీసింది.

Emotional Availability : బంధాల్లో బాండ్ గట్టిపడాలనుకుంటున్నారా? మరి ఈ ఒక్క ఎమోషనల్ గిఫ్ట్ మీ దగ్గరుందా?

Related Articles

Back to top button