Just InternationalLatest News

H-1B visa: టికెట్ల రేట్లు ట్రిపుల్..పెరిగిన H-1B వీసాదారుల కష్టాలు

H-1B visa: ట్రంప్ ప్రకటన రావడమే ఆలస్యం మెక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి బడా కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేశాయి. సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రి లోపు అమెరికా రావాలంటూ ఆదేశాలిచ్చాయి.

H-1B visa

కొన్ని రోజులుగా భారత్ ను టార్గెట్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్ వన్ బి( H-1B) వీసాలపై ఫీజును అమాంతం లక్షకు పెంచేశారు. దీనివల్ల అగ్రరాజ్యంలో ఉన్న టెక్ కంపెనీలన్నీ షాక్ తిన్నాయి. ట్రంప్ ప్రకటన రావడమే ఆలస్యం మెక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి బడా కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేశాయి. సెప్టెంబర్ 21వ తేదీ అర్థరాత్రి లోపు అమెరికా రావాలంటూ ఆదేశాలిచ్చాయి. ఫలితంగా ఎక్కడెక్కడో ఉన్న H-1B వీసా(H-1B visa)దారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి.

అమెరికా తిరిగి వెళ్ళేందుకు వీరంతా ఎయిర్ పోర్టులకు క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా కెనడా, న్యూజెర్సీ, న్యూయార్క్ వంటి ఎయిర్ పోర్టులకు వెళ్లే విమానాలన్నీ ఫుల్ అయిపోయాయి. కొన్ని టికెట్లను ముందుగానే బ్లాక్ చేసుకున్న ఎయిర్ లైన్స్ సంస్థలు దొరికిందే అవకాశంగా రేట్లను డబుల్, ట్రిపుల్ చేసేసాయి. అయినా కూడా H-1B(H-1B visa) వీసాదారులు ఎలాగోలా అమెరికా చేరితే చాలురా అనుకుంటూ ఎంత రేటైనా కొనుగోలు చేస్తున్నారు. ఇండియాకు వెళదామని బయలుదేరిన కొందరు మధ్యలో ఏదో ఒక ఎయిర్ పోర్టు నుంచి రిటర్న్ అయిపోతున్నారు. కనక్టింగ్ ఫ్లైట్స్ కు బుక్ చేసుకున్న వారు మధ్య హాల్ట్ లోనే తిరిగి అమెరికా ఫ్లైట్స్ లో టికెట్ల కోసం నానా తంటాలు పడుతున్నారు.

H-1B visa
H-1B visa

అటు ఇండియా నుంచి అమెరికా వెళుతున్న విమానాలన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి. దీనిని క్యాష్ చేసుకునే పనిలో ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలు బిజీగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ జాన్ ఎఫ్.కెన్నడి ఎయిర్ పోర్ట్ కు.. వన్ వే ఛార్జీ 37 వేల నుంచి 70 వేల వరకూ పెరిగినట్టు తెలుస్తోంది. తర్వాత గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ టికెట్ల రేట్లన్నీ ఒక్కసారిగా రెండు, మూడు రెట్లు పెరిగిపోయాయి. భారత్ లోని పలు ప్రధాన నగరాల నుంచి డైరెక్ట్ ఫ్లెయిట్ టికెట్ల రేట్లను భారీగా పెంచేశారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అమెరికాలోని ఏదో ఒక ఎయిర్ పోర్టుకు వెళ్లిపోతే చాలు అక్కడ నుంచి తాముండే నగరాలకు ఎప్పుడు చేరుకున్నా బాధ లేదనుకుంటూ కొందరు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ కు వెళ్ళాల్సిన విమానం కొన్ని గంటలకు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో నిలిచింది. ఈ ఫ్లైట్ లో భారత్ కు వెళ్ళాల్సిన వారంతా గందరగోళంలోనే పడిపోయి ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. కొందరు క్యాన్సిల్ చేసుకోగా.. మరికొందరు ఇండియా వెళ్లాలా వద్దా అనే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్టు ఓ నెటిజన్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.

అంతేకాదు మరోవైపు అక్రమ వలసలపై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సిరియన్లకు గతంలో ఇచ్చిన తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో, అమెరికాలో నివాసం ఉంటున్న వేలమంది సిరియన్లు ఇప్పుడు 60 రోజుల్లోగా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గడువులోగా వెళ్లని వారిని అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని అగ్రరాజ్యం హెచ్చరించింది. దీంతో అమెరికాలోని ఎయిర్ పోర్టులు నిండిపోవడంతో పాటు విమానాలు కూడా హౌస్ పుల్ అవనున్నాయి. మొత్తంగా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ హాయిగా పడుకుని నిద్రపోతుంటే…కొన్ని గంటలకు హెచ్1 బి వీసాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

H-1B: భారతీయులకు భారీ షాక్.. H-1B వీసా నిబంధనలు మార్చిన ట్రంప్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button