Philippines :ఫిలిప్పీన్స్ పై విరుచుకుపడ్డ రాకాసి తుఫాను
Philippines : ఫిలిప్పీన్స్ దేశం తుఫాన్ దెబ్బకు అతలాకుతలమవుతోంది. ఈ ఏడాదిలోనే అత్యంత పవర్ ఫుల్ తుఫానుగా భావిస్తున్న టైపూన్ రాగస ఫిలిప్పీన్స్ పై విరుచుకుపడింది.

Philippines
ఏడాదిన్నర కాలంగా పలు దేశాలను ప్రకృతి వైపరీత్యాలు వణికిస్తున్నాయి. వరుస తుఫాన్లు, భూకంపాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకదాని నుంచి తేరుకునే లోపే మరొకటి వచ్చి పడుతోంది. తాజాగా ఫిలిప్పీన్స్ దేశం తుఫాన్ దెబ్బకు అతలాకుతలమవుతోంది. ఈ ఏడాదిలోనే అత్యంత పవర్ ఫుల్ తుఫానుగా భావిస్తున్న టైపూన్ రాగస ఫిలిప్పీన్స్(Philippines) పై విరుచుకుపడింది.
దీని ప్రభావంతో ఉత్తర ఫిలీప్పీన్స్(Philippines) లో భీకర గాలులు, భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాకాసి తుఫాను ఉత్తర కాగయన్ ప్రావిన్స్ దగ్గరున్న పనుయిటన్ ద్వీపం తీరాన్ని తాకిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 267 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయనీ, ఇది ఐదు హరికేన్లకు సమానమని వెల్లడించింది.

ఈ తుఫాను ప్రభావం ఇంత భారీస్థాయిలో ఉంటుందని అక్కడి అధికారులు ఊహించలేదు. ఫలితంగా ఫిలీప్పీన్స్ ప్రజలు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఉత్తర ఫిలిప్పీన్స్ , లుజోన్ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను కూడా పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. నార్త్ కాగయాన్ ప్రాంతంలోని చాలా చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. నార్త్ కాగయాన్ ప్రావిన్స్ లోని హాస్పిటల్స్ ను అలెర్ట్ చేశారు.
The wind is quite chaotic, due to surrounding hills. Periods of calm interrupted by strong gusts of wind as #super #typhoon #ragasa #nandoph passes south of Batan in Philippines pic.twitter.com/fYDwUfalUq
— James Reynolds (@EarthUncutTV) September 22, 2025
ఈ భీకరమైన తుఫాను ప్రభావం చైనా మీద కూడా పడింది. దీంతో వందలాది విమానాలను రద్దయ్యాయి. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సంభవించలేదని కెనడియన్ వాతావరణ సంస్థ అంచా వేసింది. ఈ కారణంగానే అత్యంత శ్యక్తివంతమైన తుపాను టైపూన్ రాగసగా పేర్కొంది. ఆసియా ద్వీపం పరిధిలో ఉన్న పలు ప్రాంతాలపై ఈ భీకర తుఫాను ప్రభావం గట్టిగానే పడనుంది.

ముఖ్యంగా చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ తో పాటు మకావు, హాంకాంగ్ లపై ఎఫెక్ట్ ఉండనుందని చెప్పుకొచ్చింది. తుఫాను కారణంగానే హాంకాంగ్ ఎయిర్ పోర్టులో రెండు రోజుల పాటు అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. అటు చైనా వాతావరణ శాఖ కూడా తుఫాను ప్రభావం ఉన్న తమ ప్రాంతాల్లో తీవ్రస్థాయి హెచ్చరికలు ఇచ్చింది. లెవల్ 2 ఎమర్జెన్సీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో స్కూల్స్ , వ్యాపార సముదాయాలు, మాల్స్ వంటివి మాతపడ్డాయి. పిలిప్పీన్స్ (Philippines)రాజధాని మనీలాకు వందల కి.మీ దూరంలో టైపూన్ రాగస కేంద్రీకృతమైంది. బుధవారం రాత్రికి చైనా తీరాన్నితాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది.