Just NationalLatest News

Farmers: రైతులకు బిగ్ అలర్ట్..పీఎం కిసాన్ కొత్త రూల్ గురించి తెలుసుకోండి..

Farmers:కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకం నియమాలను పాక్షికంగా మార్చి, సరిహద్దు ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు పెద్ద ఊరట కబురు వినిపించారు.

Farmers

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ యోజన) కింద 21వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతు(farmers)లకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన శుభవార్త అందించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకం నియమాలను పాక్షికంగా మార్చి, సరిహద్దు ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు పెద్ద ఊరట కబురు వినిపించారు.

ఇప్పటివరకు, భూమి యాజమాన్య పత్రాలు (Land Ownership Documents) లేని కారణంగా సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోయారు. కొత్త మార్పులతో, భూమి పత్రాలు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

farmers
farmers

సరిహద్దు ప్రాంతాల్లో భూమి పత్రాలు లేని రైతులకు కూడా పీఎం కిసాన్ పథకం ప్రయోజనం వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో, రైతు వాస్తవానికి ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నాడని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాలి. ఈ ధృవీకరణ తర్వాత, ఆ రైతు పథకం యొక్క తదుపరి విడతను పొందేందుకు అర్హులు అవుతారు.

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ రైతు(farmers)లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 21వ విడత (రూ.2,000) దీపావళి నాటికి రైతుల ఖాతాలకు బదిలీ చేయవచ్చని ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. దీపావళి రోజున లేదా అంతకు ముందే అర్హులైన లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాలకు రూ. 2వేలు బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో 20వ విడతను ఆగస్టు 2న విడుదల చేసింది. ఈ అంచనా ప్రకారం, అక్టోబర్ 20 నాటికి రైతులకు తదుపరి విడత అందే అవకాశం ఉంది. అయితే, 21వ విడత విడుదల అధికారిక తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

సాధారణంగా, ఈ పథకం కింద అన్ని వాయిదాలు దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల అవుతాయి. అయితే, ఈసారి నియమాలు కొద్దిగా మారాయి.వరద ప్రభావిత రాష్ట్రాలలోని రైతు(farmers)లు ఈసారి 21వ విడతను ముందుగా అందుకునేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని రైతులు మొదటి విడత పొందవచ్చని పీఎం నరేంద్ర మోదీ ఇటీవల సూచనప్రాయంగా తెలిపారు.

పీఎం కిసాన్ రైతులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.. e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయకుండా పథకం డబ్బులు పొందలేరు. ఇ-కేవైసీ పెండింగ్ ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు క్రెడిట్ కావు.

e-KYC పూర్తి చేయాలంటే..పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) విజిట్ చేయాలి. హోమ్‌పేజీలో ‘e-KYC’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

మీరు 21వ విడత స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేయొచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) విజిట్ చేయండి.హోమ్‌పేజీలో ఉన్న Farmers Corner విభాగానికి వెళ్ళండి. Beneficiary Status పై క్లిక్ చేయండి. ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ వంటి మీ వివరాలను ఎంటర్ చేయండి.
మీరు ఇప్పుడు ‘Beneficiary List’ కింద మీ గ్రామ జాబితాను కూడా చెక్ చేయొచ్చు.

Detox :లివర్ డీటాక్స్ అవ్వాలా? రాత్రి పడుకునే ముందు గోల్డెన్ మిల్క్ తాగండి

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button