Mahesh: మహేష్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. మరో నాటు నాటు మ్యాజిక్ రెడీ
Mahesh:'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు' పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh), దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న (SSMB29) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత, రాజమౌళి ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తుండటంతో, సినిమాకు సంబంధించిన చిన్న వార్త కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం నిర్మాత కేఎల్ నారాయణ ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నారని వినిపిస్తోంది.
ఈ సమయంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించి, ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టింది. ఇప్పుడు అలాంటి మ్యాజిక్‌నే మహేష్ బాబు కోసం సెట్ చేశాడట రాజమౌళి.

ఈ పాటను పక్కా మాస్, ఫోక్ టైప్లో కీరవాణి కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఈ పాట కాన్సెప్ట్ డిజైనింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యిందట. ముఖ్యంగా ఈ పాటలో మహేష్ బాబు(Mahesh)తో పాటు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కనిపించనున్నట్లు టాక్. ‘నాటు నాటు’ పాటకు అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ ఈ మాస్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించనున్నారట. త్వరలోనే ఈ పాట షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఇది కనుక వర్కౌట్ అయితే, ఫ్యాన్స్ మరో బ్లాక్‌బస్టర్ మాస్ బీట్ సెట్ అవ్వడం ఖాయం.
ఇక ఈ క్రేజీ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నా.. తాజాగా ఈ లిస్ట్‌లో ‘వారణాసి’ అనే టైటిల్ చేరింది. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో మహేష్ బాబు మెడలో త్రిశూలం, ఢమరుఖం, లింగం, నందీశ్వరుడు కలిపిన లాకెట్ ఉండటం వల్ల, ఈ సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అర్థమవుతోంది. ఆ ఎలిమెంట్స్‌కు మ్యాచ్ అయ్యేలా ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని టీం చూస్తున్నాకూడా , ‘వారణాసి’ అనే పేరు ఇండియా వరకు బాగానే ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఎలా రిప్రజెంట్ చేస్తుందోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.