Just International

H-1B visa: హెచ్-1బి ఉద్యోగులు ఇక మాకొద్దు టీసీఎస్ సంచలన నిర్ణయం

H-1B visa: ఒకవైపు భారత్ లో భారీగా లేఆఫ్స్ కొనసాగిస్తూనే అమెరికాలో కూడా స్థానికుల చేత అక్కడి భారతీయ టెక్ నిపుణుల స్థానాలను భర్తీ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

H-1B visa

హెచ్-1బి(H-1B visa) వీసాలకు సంబంధించి ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫీజును భారీగా పెంచేసారో అక్కడి కంపెనీలకు తడిసి మోపెడవుతోంది. ఇంతటి భారీ ఫీజులను భరించలేక పలు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా టీసీఎస్ సంచలన ప్రకటన చేసింది. ఇక హెచ్-1బీ వీసా ఉద్యోగులను తీసుకోవడాన్ని తగ్గించుకుంటున్న స్పష్టం చేసింది. స్థానిక ఉద్యోగుల నియామకాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తేల్చేసింది. దీనికి సంబంధించి టీసీఎస్‌ సీఈఓ కె.కృతివాసన్‌ ఓ ఇంటర్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్‌-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు.

దీంతో భారతీయ టెక్ నిపుణులపైనే ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. తాజాగా అక్కడి పరిస్థితులకు తగ్గట్టు టీసీఎస్ కూడా తన ప్రణాళికలను మార్చుకుంటున్నట్టు తెలిపింది. దీనిలో భాగంగానే కొత్తగా హెచ్-1బీ వీసా(H-1B visa) ఉద్యోగుల నియామకానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. నిజానికి భారత టెక్ కంపెనీల్లో ఎక్కువగా అమెరికాలోని హెచ్1బి వీసా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ టీసీఎస్ మాత్రమే. 2009-25 మధ్య కాలంలో ఏకంగా 98వేలకు పైగా టెక్కీలను ఉద్యోగాల్లోకి తీసుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో అప్రమత్తమైన టీసీఎస్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

H-1B visa
H-1B visa

ఇప్పటికే స్థానికులనే రిక్రూట్ చేసుకునే పనిలో పడిందని కూడా సమాచారం. ఒకవైపు భారత్ లో భారీగా లేఆఫ్స్ కొనసాగిస్తూనే అమెరికాలో కూడా స్థానికుల చేత అక్కడి భారతీయ టెక్ నిపుణుల స్థానాలను భర్తీ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీసీఎస్ అమెరికాలో పనిచేస్తున్న 33 వేల మంది టెక్ నిపుణుల్లో 11 వేలకు పైగా హెచ్-1బీ వీసా ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.

త్వరలోనే ఈ సంఖ్య భారీగా తగ్గిపోయే ఛాన్సుంది. అదే జరిగితే చాలా మంది భారతీయ టెక్ నిపుణుల ఉద్యోగాలు ఊడిపోతాయి. పైగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)లోనూ టీసీఎస్ భారీగా పెట్టుబడులకు రెడీ అయింది. దీని కోసం 7 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఏఐ విషయంలో ఇంకా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటకీ టీసీఎస్ మాత్రం ఏఐ ఆధారిత సేవలతో తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందిస్తామని బలంగా నమ్ముతోంది.ఇకపై వచ్చే ప్రాజెక్టుల్లో 100 శాతం ఏఐ వినియోగానికి నిర్ణయం తీసుకున్నట్టు టీసీఎస్ తెలిపింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button