just AnalysisJust TelanganaLatest News

Hyderabad Water Crises : భాగ్యనగర దాహార్తి తీరే దారేది?.. ఎల్ నినో దెబ్బకు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న నీటి సవాల్..

Hyderabad Water Crises : 2026 మే సమయానికి తెలంగాణ సగటు భూగర్భ జలమట్టం 9.29 మీటర్లకు చేరినట్లు రికార్డులు చెబుతున్నా.. హైదరాబాద్ వంటి మెట్రో ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

Hyderabad Water Crises

ఎటు చూసినా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు కనిపించే బహుళ అంతస్తుల భవనాలు, గ్లోబల్ రేంజ్‌లో మెరిసిపోతున్న ఐటీ కారిడార్లు, రోజుకో కొత్త కాలనీ.. ఇదీ వరల్డ్ మ్యాప్‌లో ధగాధగా మెరుస్తున్న భాగ్యనగరపు రూపురేఖలు.

ఇలా సిటీ ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతకంటే స్పీడ్‌గా తాగునీటి సమస్య(Hyderabad Water Crises) ప్రతీ ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రోజువారీ అవసరాలకు నల్లాల్లో నీళ్లు రాక, ట్యాంకర్ల కోసం గంటల తరబడి వెయిట్ చేస్తూ తాగడానికి ప్యాకేజ్డ్ వాటర్ క్యాన్లు కొనుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన జనాభాకు తగినట్లుగా వాటర్ సప్లై సిస్టమ్‌ను డెవలప్ చేయలేకపోవడమే ఇప్పుడు విశ్వనగరానికి అతిపెద్ద పరీక్ష అయి కూర్చుంది.

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి సుమారు 1.3 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఉపాధి, ఎడ్యుకేషన్, మెడికల్ కోసం వచ్చిపోయే ఫ్లోటింగ్ పాపులేషన్‌ను కూడా కలిపితే.. సిటీకి రోజుకు కనీసం 735 మిలియన్ గ్యాలన్ల వాటర్ కావాల్సి ఉంటుంది(Hyderabad Water Crises).

కానీ వాటర్ బోర్డు మాత్రం కేవలం 585 మిలియన్ గ్యాలన్ల వాటర్‌ మాత్రమే సప్లై చేయగలుగుతోంది. అంటే ప్రతిరోజూ ఏకంగా 150 మిలియన్ గ్యాలన్ల కొరత ఏర్పడుతోంది. లీటర్లలో చెప్పాలంటే ఇది రోజుకు ఏకంగా 68 కోట్ల లీటర్ల నీటి లోటు అన్నమాట.

ఈ గ్యాప్ వల్ల చాలా కాలనీ వాసులంతా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది మే నెల చివరి వారంలో రోజుకు ఏకంగా 15 వేలకు పైనే ట్యాంకర్ బుకింగ్‌లు నమోదయ్యాయంటేనే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ప్రైవేట్ ట్యాంకర్లు పెంచిన ఛార్జీలతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ మొత్తం తలకిందులవుతోంది.

మరోవైపు భూగర్భ జలాలు కూడా స్పీడుగా అడుగంటిపోతున్నాయి. దానికి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఎల్‌నినో ప్రభావమే మెయిన్ రీజన్ అని నిపుణులు అంటున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్ పెరగడం వల్ల ఏర్పడిన.. ఈ ఎల్ నినో వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం దారుణంగా పడిపోయింది.

దీనివల్ల భూమిలోకి నీరు ఇంకే అవకాశం లేకపోవడంతో ఐటీ కారిడార్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని బోర్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. గతంలో తక్కువ లోతులోనే నీళ్లు పడిన చోట కూడా .. ఇప్పుడు ఎంత లోతుకు వెళ్లినా చుక్క నీటి చుక్క దొరకడం లేదు. 2026 మే సమయానికి తెలంగాణ సగటు భూగర్భ జలమట్టం 9.29 మీటర్లకు చేరినట్లు రికార్డులు చెబుతున్నా.. హైదరాబాద్ వంటి మెట్రో ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

సిటీ అంతా కూడా మినరల్ వాటర్ క్యాన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు రోజుకు 50 లక్షల లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ సేల్స్ జరుగుతాయని అంచనా వేస్తే.. ఇప్పటి జనాభాకు అది కొన్ని రెట్లు పెరిగే ఉంటుంది. దీనివల్ల ప్రజలపై అడిషనల్ ఫైనాన్షియల్ బర్డెన్ పడటమే కాకుండా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

Hyderabad Water Crises
Hyderabad Water Crises

పైగా సిటీ వాసులు కొంటున్న ఈ క్యాన్ నీటి నాణ్యత ఎంతవరకు ఉందనేది మరో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సంక్షోభాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ప్రభుత్వం రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి తాగునీటి సప్లై ఫేజ్ 2, 3 ప్రాజెక్టులను స్పీడప్ చేసింది. 2027 చివరికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి హైదరాబాద్ నీటి కొరత తీర్చడమే కాకుండా మూసీ పునరుజ్జీవనానికి వాడుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

అయితే సుదూర ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా ప్రభుత్వం ఇమ్మీడియట్ రిలీఫ్‌గా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఓఆర్‌ఆర్ పరిధిలో వేలాది ఇంకుడు గుంతల నిర్మాణం, పాత పైపులైన్లలో లీకేజీలు అరికట్టడంతో పాటు.. రీసైకిల్ చేసిన వేస్టేజ్‌ నీటిని నిర్మాణ రంగానికి, పార్కులకు వాడటం వంటివి యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి.

కేవలం హైటెక్ భవనాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే సిటీ డెవలప్మెంట్‌కు సింబల్స్ కావు. ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన నీటి భరోసా కల్పించినప్పుడే హైదరాబాద్(Hyderabad Water Crises) నిజమైన గ్లోబల్ సిటీగా దర్జాగా నిలబడుతుంది.

OpenAI : ఓపెన్‌ఏఐ సీక్రెట్ మీటింగ్‌పై కన్ను..ఏఐ టెక్నాలజీతోనే దొంగను పట్టిన ఎఫ్‌బీఐ..

Related Articles

Back to top button