Period Leave: విద్యార్థినులకు ఆ 3 రోజులు సెలవులు..బాలింతలకు 6 నెలల జీతం.. ఆ రాష్ట్రం ఎప్పుడూ స్పెషలే..
Period Leave : విద్యార్థినులకు నెలకు 3 రోజుల పీరియడ్స్ లీవ్‌తో పాటు అసంఘటిత రంగాల మహిళలకు జీతంతో కూడిన 6 నెలల మెటర్నిటీ సెలవులు ప్రకటించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.
Period Leave
మన దేశంలో చాలా రాష్ట్రాలు ఇంకా మహిళల హెల్త్, పని చేసే చోట సేఫ్టీ, విద్యార్థినుల ప్రాథమిక అవసరాలు, డెలివరీ తర్వాతి మద్దతు వంటి అంశాలను ఒక సాధారణ పాలసీగా మార్చడానికి కూడా తర్జనభర్జనలు పడుతున్న సమయంలో.. కేరళ మరోసారి చారిత్రాత్మక ముందడుగు వేసింది.
స్కూళ్లు,కాలేజీల్లో చదువుకునే అమ్మాయిలకు ప్రతినెలా 3 రోజుల పాటు పీరియడ్స్ సెలవులు(Period Leave )ఇవ్వాలని, అలాగే ఎలాంటి భద్రత లేని చిన్న చిన్న పనుల్లో ఉండే మహిళలకు శాలరీతో కూడిన 6 నెలల మెటర్నిటీ లీవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక మామూలు ప్రకటన మాత్రమే కాదు, ఆడవాళ్లు నెలనెలా ఎదుర్కొనే శారీరక, మానసిక సమస్యలను ఒక ప్రభుత్వం గుర్తించి.. గౌరవించిందని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణగా మహిళలు చెప్పుకుంటున్నారు. ప్రజల అవసరాలను ముందే ఊహించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో కేరళ ఎప్పుడూ ముందే ఉంటుందని ఈ తాజా విషయాలు నిరూపిస్తున్నాయి.
పీరియడ్స్ టైములో చాలా మంది అమ్మాయిలు కడుపునొప్పి, నీరసం, నడుమునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. చదువుకోవాలని ఉన్నా కూడా, ఆ 3 రోజులూ క్లాస్ రూమ్‌లలో గంటల తరబడి కూర్చోవడం వాళ్లకు నరకంలా అనిపిస్తుంది. ఎంతో మంది విద్యార్థినులు ఈ బాధలను మౌనంగా భరిస్తూ..తప్పనిసరి పరిస్థితుల్లో వెళుతున్నారు.
అలాంటి గ్రౌండ్ లెవెల్ బాధలను మానవత్వంతో అర్థం చేసుకున్న కేరళ ప్రభుత్వం.. ప్రతినెలా మూడు రోజుల పాటు పీరియడ్స్ సెలవు(Period Leave) లు హక్కుగా ఇవ్వడం చాలా గ్రేట్ అని చెప్పాలి. దీంతో విద్యార్థినులు ఎగ్జామ్స్, అటెండెన్స్ టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామాలలో, ఫ్యామిలీల్లో కూడా ఈ విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడటానికి ఇంకా సిగ్గుపడే రోజుల్లో, ప్రభుత్వమే ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల సొసైటీలో ఒక పెద్ద మార్పు రావడం ఖాయం అన్న చర్చ నడుస్తోంది.
మరో అద్భుతమైన విషయం ఏంటంటే, చిన్న చిన్న పనులు చేసుకునే మహిళల గురించి ఆలోచించడం. రోజువారీ కూలీలు, బట్టల షాపులు, చిన్న చిన్న పరిశ్రమలలో, ప్యాకింగ్ యూనిట్లలో పనిచేసే మహిళలకు సాధారణంగా ఎలాంటి సెలవులు కానీ, ఉద్యోగ భద్రత కానీ ఏమీ ఉండవు.
అలాంటి మహిళలకు డెలివరీ అయిన తర్వాత 6 నెలల పాటు పూర్తి జీతంతో కూడిన లీవ్స్ ఇవ్వడమంటే తల్లిని, పుట్టిన బిడ్డను ఒకేసారి కాపాడుకోవడమే అవుతుంది. డెలివరీ అనే గండం దాటిన తర్వాత మహిళలకు సరైన విశ్రాంతి దొరకకపోతే లైఫ్ లాంగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వెంటాడుతుంటాయి. ఆ టైంలో జీతం వస్తుందనే ధీమాతో హ్యాపీగా రెస్ట్ తీసుకోవడానికి ఈ ఆరు నెలల లీవ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
నిజానికి కేరళను మిగతా రాష్ట్రాల కంటే ఎప్పుడూ భిన్నంగా నిలబెట్టేది అక్కడి ప్రభుత్వ ఆలోచనా విధానం మాత్రమే. కేరళలో ఎప్పటినుంచో చదువు, వైద్యం, ఆడవాళ్ల ఎదుగుదల వంటి విషయాల్లో ఎప్పుడూ నెంబర్ వన్ స్థానంలోనే ఉంటూ వస్తోంది. అక్కడ పాలకులు ప్రజల సమస్యలను కేవలం పేపర్లలో వచ్చే వార్తల్లా చూడరు, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించడానికి తపన పడుతుంటారు.
చాలా రాష్ట్రాల్లో మహిళల రక్షణ, హెల్త్ గురించి స్టేజీల మీద పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇచ్చి వదిలేస్తుంటారు. కానీ కేరళ రాష్ట్రం మాత్రం సమస్యలను పట్టించుకోవడమే కాదు..వాటి పరిష్కారాలను చట్టంగా మార్చి గ్రౌండ్ లెవెల్లో అమలు చేసి చూపిస్తోంది.

నిజానికి కేరళ ఇలాంటి విప్లవాత్మక, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆడవాళ్ల హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం, స్కూల్ అమ్మాయిల సానిటరీ నీడ్స్ కోసం బడ్జెట్ కేటాయించడం వంటి ఎన్నో పనులు చేసింది. అందువల్ల ఈ తాజా నిర్ణయాలేవీ కూడా అకస్మాత్తుగా వచ్చినవి కావు, అక్కడి సంస్కృతిలోనే ఒక భాగంగా మారిపోయాయి.
ఈ రూల్స్ కేవలం కేరళ రాష్ట్రానికే కాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రానికి కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాయి. పీరియడ్స్(Period Leave) అనేదాన్ని ఒక అవమానంగా, అసహ్యంగా చూడకుండా, అలాగే మాతృత్వాన్ని కూడా ఒక పెద్ద బాధ్యతగా గుర్తించడం ఎంత ముఖ్యమో కేరళ నిరూపించింది. డెవలప్మెంట్ అంటే కేవలం పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రావడం మాత్రమే కాదు, సొసైటీలో ఉండే సామాన్య ప్రజల జీవితాల్లో వచ్చే మార్పు కూడా ముఖ్యమేనని. కేరళ స్టేట్ మరోసారి దేశానికి నిరూపించి చూపించింది.
Mokshagna:మోక్షజ్ఞ కోసం నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారా? 2 స్టోరీలు కూడా రెడీగా ఉన్నాయా?





