Just Andhra PradeshJust PoliticalLatest News

Elections Schedule : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..పల్లెలు, పట్టణాల్లో ఇక ఎలక్షన్ హీట్..

Elections Schedule : ఈ నెల 28వ తేదీన ఓటింగ్ ప్రాసెస్ (Polling) జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు

Elections Schedule

ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ల ఫీవర్ అప్పుడే పీక్స్‌కు చేరుకున్నట్లు అయింది. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని స్థాయిల స్థానిక సంస్థల ఎలక్షన్స్‌కు ఎస్‌ఈసీ షెడ్యూల్‌(Elections Schedule)ను ఫిక్స్ చేసింది. మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీలు (10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు) మొదలుకుని గ్రామ పంచాయతీల వరకు అన్నిటికీ వరుసగా ఎలక్షన్స్ జరగనున్నాయి. రాజకీయ శ్రేణులకు క్షణం తీరిక లేకుండా ఈ ఎలక్షన్ క్యాలెండర్ ఉత్కంఠ రేపుతోంది.

షెడ్యూల్ ప్రకారం.. ముందుగా అక్టోబర్ 28 వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగి, అక్టోబర్ 30వ తేదీన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత నవంబర్ 3వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి, నవంబర్ 5వ తేదీన కౌంటింగ్ పూర్తి చేస్తారు.

ఇక గ్రామీణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌ను3 విడతలుగా ప్లాన్ చేశారు. నవంబర్ 26వ తేదీన మొదటి దశ, నవంబర్ 29వ తేదీన రెండో దశ, డిసెంబర్ 2వ తేదీన మూడో దశ పోలింగ్ జరుగుతుంది.

ఈ షెడ్యూల్ విడుదల అవడంతో రాజకీయ పార్టీల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దించడానికి అప్పుడే ప్రచార వ్యూహాలు మొదలయ్యాయి.పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కేండిడేట్స్ నుంచి అక్టోబర్ 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత రోజు అనగా అక్టోబర్ 19 వ తేదీన నామినేషన్ల పరిశీలన (Scrutiny) చేపడతారు.

Elections Schedule
Elections Schedule

పోటీ నుంచి తప్పుకోవాలనుకునే కేండిడేట్స్ కోసం అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువును ఇచ్చారు. ఫైనల్ కేండిడేట్స్ ఖరారు తర్వాత, ఈ నెల 28వ తేదీన ఓటింగ్ ప్రాసెస్ (Polling) జరగనుంది.

ఆ తర్వాత అక్టోబర్ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. షెడ్యూల్ వెలువడటంతో సంబంధిత మున్సిపల్ ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనావళి (Code) వెంటనే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో ..ఎప్పటిలాగే పోలింగ్ ముగిసిన రోజే రిజల్ట్‌ను కూడా ప్రకటించనున్నారు. ఈ భారీ ఎలక్షన్ షెడ్యూల్‌తో పల్లె నుంచి పట్టణం వరకు అన్ని పార్టీల నేతలు కూడా ప్రచార రంగంలోకి దూకడానికి రెడీ అవుతున్నారు.

OpenAI : ఓపెన్‌ఏఐ సీక్రెట్ మీటింగ్‌పై కన్ను..ఏఐ టెక్నాలజీతోనే దొంగను పట్టిన ఎఫ్‌బీఐ..

Related Articles

Back to top button