Just Andhra PradeshLatest News

AP Model Of Education : సింగపూర్, ఫిన్లాండ్ లెవెల్ లెర్నింగ్..ఈ ట్రైనింగ్‌తో గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మారతాయా?

AP Model Of Education : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో బెస్ట్ టీచర్లను విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు.

AP Model Of Education

గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే పేద, మధ్యతరగతి పిల్లలకు ఇంటర్నేషనల్ స్థాయి నాణ్యమైన ఎడ్యుకేషన్‌ను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో బెస్ట్ టీచర్లను విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు.

ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌లో 37 మంది ఉపాధ్యాయులను సింగపూర్ పంపగా, తాజాగా మరో 29 మంది టీచర్ల టీమ్ ఫిన్లాండ్ టూర్‌కు రెడీ అయింది. ఆగస్టు 17 నుంచి 26 వరకు 8 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో టీచర్లు ఫిన్లాండ్‌లోని టుర్కు యూనివర్శిటీలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారు.

ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌గా గుర్తింపు పొందిన ఫిన్లాండ్ మోడల్ ద్వారా ఏపీలోని స్కూల్స్‌కు, స్టూడెంట్స్‌కు మల్టీలెవల్‌లో బెనిఫిట్స్ కలగనున్నాయి. మొదటిగా బట్టీ పట్టి చదివే చదువులకు బై చెప్పి పిల్లలు ఆటపాటలతో, ఆనందకరమైన వాతావరణంలో వేగంగా నేర్చుకునే పద్ధతులు (Play-based Education & Joyful Pedagogy) అమల్లోకి రానున్నాయి. అలాగే బేసిక్ లెవల్‌లోనే అక్షరాస్యత, గణిత నైపుణ్యాలను (Foundational Learning) స్ట్రాంగ్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, క్రియేటివిటీ పెరుగుతాయి.

ఇక మూడోది.. విదేశాల్లో ట్రైనింగ్ పొందిన ఈ 29 మంది టీచర్లు ఇకపై కేవలం తమ స్కూల్‌ వరకే పరిమితం కాకుండా, తమ జిల్లాల్లోని వేలాది మంది ఇతర టీచర్లకు రీసోర్స్ పర్సన్లుగా, మెంటర్లుగా మారి ఈ కొత్త లెర్నింగ్ మెథడ్స్‌పై అవగాహన కల్పిస్తారు. దీనివల్ల డిజిటల్ సాధనాల వినియోగం పెరగడమే కాకుండా, టీచర్లలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయి.

ఇటు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ రేట్ విషయానికి వస్తే, ఇది కేవలం ఒక్క టూర్‌తోనే అయిపోయేది కాకపోవడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ఓరియంటేషన్, ఫిన్లాండ్‌లో డైరెక్ట్ అబ్జర్వేషన్, ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా టుర్కు యూనివర్శిటీ ఎక్స్‌పర్ట్స్ కంటిన్యూయస్ మెంటరింగ్ అనే మూడు స్టేజ్‌లలో పక్కాగా డిజైన్ చేశారు.

AP Model Of Education
AP Model Of Education

ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు క్షేత్రస్థాయికి వచ్చాక మన స్కూల్స్ సిట్యువేషన్‌కు తగినట్లుగా ఒక రోడ్‌మ్యాప్ రెడీ చేసి మోడల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. విదేశీ పద్ధతులను హడావుడిగా రుద్దకుండా, మన లోకల్ రీసోర్సెస్‌కు అనుగుణంగా మార్చి అమలు చేయడం వల్ల ఈ ఈవెంట్ సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. టీచర్ల నిబద్ధత, కంటిన్యూ సూపర్‌విజన్ తోడైతే ఈ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాబోయే రోజుల్లో నేషనల్ ఎడ్యుకేషన్‌ సిస్టంలోనే ఒక నయా బెంచ్‌మార్క్‌గా నిలవడం గ్యారంటీ.

Natural Dishwash Liquid :డిష్‌వాష్ సబ్బులు వాడుతున్నారా?..ఆ సైలెంట్ కిల్లర్‌కు బదులు ఇది ట్రై చేయండి..

Related Articles

Back to top button