Just Andhra PradeshJust PoliticalLatest News

Nominations : కాసేపట్లో నామినేషన్ల ఘట్టం షురూ..3,942 స్థానాల వేటలో కూటమి, విపక్షాల ఎలక్షన్ స్ట్రాటజీ

Nominations : మొత్తం 3,942 కార్పొరేటర్ అండ్ కౌన్సిలర్ వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండటంతో గ్రాస్ రూట్ లెవెల్‌లో టిక్కెట్ల పోరు తారాస్థాయికి చేరింది.

Nominations

ఏపీ పొలిటికల్ సినారియోపై పట్టణ ప్రాంత ఓటర్ల నాడిని పట్టి చూపించే పురపాలక పోరుకు సమయం దగ్గర పడింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి ఉదయం 11 గంటల నుంచి అధికారికంగా ప్రారంభం కావడంతో .. పట్టణాల్లో పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. 28 జిల్లాల్లో విస్తరించి ఉన్న 100 పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ అవడంతో, ఈరోజు అంటే అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సాగే ఈ నామినేషన్ల(Nominations) స్వీకరణ ఘట్టం చాలా కీలకమైన రాజకీయ పరిణామాలకు వేదిక కానుంది.

మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలను అత్యధిక మెజార్టీతో దక్కించుకుని పట్టణ ప్రాంతాల్లో తమ పట్టును నిరూపించుకోవడానికి అధికార కూటమి రెడీ అవుతుంటే ఇప్పుడైనా తమ ఉనికిని చాటుకోవాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. మొత్తం 3,942 కార్పొరేటర్ అండ్ కౌన్సిలర్ వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండటంతో గ్రాస్ రూట్ లెవెల్‌లో టిక్కెట్ల పోరు తారాస్థాయికి చేరింది.

మరోవైపు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నేతృత్వంలో ఈసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాస్వామ్య బద్ధంగా, కోడ్ ఉల్లంఘనలు లేకుండా ఎలక్షన్స్ పూర్తి చేయడంపై ఈసీ దృష్టి సారించింది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల గైడ్‌లైన్స్ అనుసరించి గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీలకు ఎప్పటిలాగే పాత గుర్తులనే కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

అయితే ఈసారి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఇప్పుడు ఈసీ విధించిన కొత్త వ్యయ పరిమితులు అతిపెద్ద సవాలుగా మారాయి. క్షేత్రస్థాయిలో కేండిడేట్స్ మితిమీరిన ఖర్చులను కంట్రోల్ చేయడానికి అలాగే సమానమైన అవకాశాలను కల్పించడానికి ఈ ఖర్చుల పరిమితిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు , మున్సిపల్ కమిషనర్లకు అత్యున్నత స్థాయి ఆదేశాలు వెళ్లాయి.

మెట్రోపాలిటన్ ప్రాధాన్యం ఉన్న గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ కేండిడేట్ గరిష్టంగా రూ. 40 లక్షలు, కార్పొరేటర్ కేండిడేట్ రూ. 15 లక్షలు ఖర్చు చేయడానికి పరిమితి విధించారు. సాధారణ కార్పొరేషన్లలో మేయర్ కేండిడేట్‌కి రూ. 25 లక్షలు, కార్పొరేటర్లకు రూ. 10 లక్షలుగా ఈ లిమిట్‌ను ఫిక్స్ చేశారు.

మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ బరిలో ఉండే కేండిడేట్స్ రూ. 20 లక్షలు, కౌన్సిలర్లు రూ. 7.50 లక్షల వరకు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్లు రూ. 10 లక్షలు, వార్డు సభ్యులు రూ. 5 లక్షలలోపే తమ ప్రచార ఖర్చును నిర్వహించుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాలు సమర్పించిన దగ్గర నుంచి కౌంటింగ్ వరకు ప్రతీ రూపాయి లెక్కను.. సమర్పించాల్సి ఉండటంతో కేండిడేట్స్ తమ వ్యయ ప్రణాళికలను ఈసీ నిబంధనలకు అనుగుణంగా రీ-డిజైన్ చేసుకుంటున్నారు. ఈ నామినేషన్ల(Nominations) గడువు పూర్తయ్యాక ఏపీ పుర పోరులో ఫైనల్ పిక్చర్ క్లియర్‌గా తేలిపోనుంది.

Parallel Conversations : బంధాలలో పారలల్ కాన్వర్సేషన్స్..మీ సంభాషణలో ఈ పొరపాట్లు జరుగుతున్నాయా?

Related Articles

Back to top button