Just Andhra Pradeshjust AnalysisLatest News

SIR : ఏపీలో 10 శాతం ఓట్లు గాయబ్..జూలై 31న రాబోతున్న డ్రాఫ్ట్ లిస్ట్‌ మీకు షాకిస్తుందా?

SIR : ఎస్‌ఐఆర్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన తాజా గణాంకాలు చూసి సామాన్యులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా షాక్ అవుతున్నారు.

SIR

ప్రజాస్వామ్యంలో మనందరి భవిష్యత్తును మార్చే అతిపెద్ద ఆయుధం ఓటు హక్కే. కానీ ఆ ఆయుధమే నకిలీగా మారితే ఎలా ఉంటుందో… ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఓటర్ల లిస్ట్‌లో లేని మనుషుల పేర్లు, చనిపోయిన వారి గుర్తింపులు, ఒక్కరికే పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు ఉంటే పరిస్థితి ఏంటి?

ఇలా ఉన్న బోగస్ నెట్‌వర్క్‌ను పునాదులతో సహా పెకిలించడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. నిన్నటితో ముగిసింది. రాత్రింబవళ్లు జరిగిన ఈ మెగా డిజిటల్ సెర్చ్ ప్రాసెస్‌కు గడువు ముగియడంతో, ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక ఊహించని సంచలనం మొదలైంది.

ఎస్‌ఐఆర్(SIR) ముగిసిన తర్వాత బయటకు వచ్చిన తాజా గణాంకాలు చూసి సామాన్యులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా షాక్ అవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా డాటాను స్కానింగ్ చేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులు.. ఏకంగా 44,71,523 ఓట్లను అన్ కలెక్టబుల్ కేటగిరీ కింద పక్కన పడేశారు.

అంటే ఏపీలో ఉన్న మొత్తం ఓటర్ల జనాభాలో సుమారు 10.74 శాతం ఓట్లు అడ్రస్ లేకుండా పోయాయి అన్నమాట. ఊహించని విధంగా చనిపోయిన వారు, పర్మినెంట్‌గా వేరే రాష్ట్రాలకు , ఇతర దేశాలకు షిఫ్ట్ అయినవారు, ఒకే పేరుతో రకరకాల పోలింగ్ బూతుల్లో ఉన్న డూప్లికేట్ ఐడీలు, అడ్రస్ అడిగితే కనీసం ఆనవాళ్లు కూడా దొరకని వేలాది మంది వ్యక్తులు ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌ జాబితాలో నిండిపోయారు.

జూలై 31న సీఈసీ అఫీషియల్‌గా రిలీజ్ చేయబోయే ముసాయిదా జాబితాలో.. ఈ మిస్ అయిన ఓట్ల జాబితా మొత్తాన్ని పబ్లిక్ రీచెక్ చేసుకోవడం కోసం అందుబాటులో ఉంచుతారు. అయితే ఈ మెగా ప్రక్షాళనలో అన్ని వివరాలు ఉన్న సాధారణ పౌరుల ఓట్లు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూష్ వల్ల ఎగిరిపోయే ఛాన్స్ ఉంది.

అందుకే మీ ఓటు సేఫ్‌గా ఉందో లేదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ముసాయిదా లిస్ట్ బయటకు వచ్చిన వెంటనే మీ పేరు అన్ కలెక్టబుల్ లిస్ట్‌లో ఉందేమో వెంటనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీ పేరు లిస్టులో లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ మీకు రెక్టిఫికేషన్ ఛాన్స్ ఇస్తోంది.

కొత్తగా ఓటు నమోదు కోసం కానీ వివరాల కరెక్షన్ కోసం కానీ ఫామ్-6, ఫామ్-8 ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్, లోకల్ అడ్రస్ ప్రూఫ్ వంటి గవర్నమెంట్ అడిగిన కొన్ని ప్రూఫ్స్‌లో ఏదొకటి సబ్‌మిట్ చేసి మీ హక్కును మళ్లీ రీ యాక్టివేట్ చేసుకోవచ్చు.

SIR
SIR

ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను, దరఖాస్తులను అన్నింటినీ క్రాస్ వెరిఫై చేసిన తర్వాత అక్టోబర్ 3న ఏపీ ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తారు.మన ఓటు మన హక్కు అని నినాదం ఇవ్వడం వరకూ ఓకే కానీ అది నిజంగా ఫాలో అవుతున్నామో లేదో చూసుకోవాలి.

పారదర్శకమైన ఎన్నికలు జరగాలన్నా, నిజమైన నాయకుడికి మాత్రమే పీఠం ఎక్కాలన్నా మన ఓటును మిస్ చేయడం, ఓటును వేయకపోవడం వంటివి మన వంతుగా చేయాలి. అందుకే రాబోయే ఎలక్షన్స్ ముఖచిత్రాన్ని తిరగరాయబోతున్న ఈ కొత్త ఓటర్ల డేటాబేస్‌లో మీ పేరు ఉందో లేదో చూసి సరి చేసుకోవడం మర్చిపోకండి.

Dharmendra Pradhan Resigned : ఎట్టకేలకు దిగి వచ్చిన ధర్మేంద్ర.. రాజీనామా చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

Related Articles

Back to top button