Just Andhra PradeshLatest News

Block Chain Technology : మీ భూమి ఇక వంద శాతం సేఫ్.. బ్లాక్‌ చెయిన్ ప్రొటెక్షన్‌ నిజంగానే రక్షణ ఇస్తుందా?

Block Chain Technology : కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీలో డేటా ఒక్క చోట మాత్రమే స్టోర్ అవ్వదు. అది ఒక నెట్‌వర్క్‌లోని అనేక కంప్యూటర్లలో లాక్ అయి భద్రంగా ఉంటుంది.

Block Chain Technology

ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా అలాగే భూ రికార్డుల భద్రతను అత్యంత ఆధునిక స్థాయికి తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం భూ హక్కుల రికార్డుల్లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ల్యాండ్స్ డిజిటలైజేషన్ , రీ-సర్వే ప్రాసెస్ ద్వారా లభించిన వివరాలను సేఫ్‌గా భద్రపరచడంలో ఈ టెక్నాలజీ ఒక ప్రొటెక్షన్ షీల్డ్‌లా పనిచేస్తోంది.

సాధారణంగా గవర్నమెంట్‌ ఆఫీసుల్లోని కంప్యూటర్లలోనూ, సర్వర్లలోనూ ఉండే డేటాను ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. అలాగే రెవెన్యూ ఆఫీసర్ స్థాయిలో ఉన్నపుడు రికార్డులు మార్చే అవకాశాలు ఉంటాయి. కానీ కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ(Block Chain Technology )లో డేటా ఒక్క చోట మాత్రమే స్టోర్ అవ్వదు.

అది ఒక నెట్‌వర్క్‌లోని అనేక కంప్యూటర్లలో లాక్ అయి భద్రంగా ఉంటుంది. ఈ విధానంలో భూ యజమాని వివరాలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఒక డిజిటల్ బ్లాక్‌గా మారుతుంది.

ఒక్కసారి రికార్డులో ఎంటర్ అయ్యాక.. అందులో చిన్న మార్పు చేయాలన్నా ఆ నెట్‌వర్క్‌లోని అన్ని కంప్యూటర్ల అంగీకారం తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల డేటాను ఎవరైనా మార్చడం లేదా రికార్డులు ట్యాంపర్ చేయడం సంపూర్ణంగా అసాధ్యం.

గతంలో భూ రికార్డుల్లో ఫోర్జరీ, డబుల్ రిజిస్ట్రేషన్లు, డూప్లికేట్ పాస్ పుస్తకాల సృష్టి, రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా పేర్లు మార్చడం వంటి అనేక భూ వివాదాలు కోర్టుల్లో వేల సంఖ్యలో పెండింగ్‌లో పడేవి.

అసలైన భూ యజమానులు తమ రైట్స్ కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చేది. ఇటువంటి అక్రమాలకు స్వస్తి పలికి, భూముల డిజిటల్ రికార్డులకు చట్టబద్ధమైన , హ్యాక్ చేయలేని విధంగా సేఫ్టీ కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చారు.

ఈ కొత్త విధానం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. మీ భూమికి సంబంధించిన డిజిటల్ రికార్డులను రెవెన్యూ సిబ్బంది గానీ, బయటి వ్యక్తులు గానీ మీ పర్మిషన్ లేకుండా మార్చడం కుదరదు.

ఒకే భూమిని ఇద్దరు లేదా ముగ్గురికి అమ్మే ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. రికార్డులు పారదర్శకంగా ఉండటం వల్ల బ్యాంకులలో క్రాప్ లోన్స్, ల్యాండ్ మార్ట్‌గేజ్ లోన్స్ త్వరగా మంజూరవుతాయి. అలాగే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డైరెక్టుగా అర్హులైన రైతులకే అందుతాయి.

Block Chain Technology
Block Chain Technology

అంతేకాకుండా భూమి కొనేవారికి ఆ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని, రైట్స్ స్పష్టంగా ఉన్నాయని నమ్మకం కలుగుతుంది. దీనివల్ల ల్యాండ్ అమ్మకాలు వేగంగా, పారదర్శకంగా జరుగుతాయి. ఫ్యూచర్‌లో సరిహద్దు తగవులు లేదా యాజమాన్య హక్కుల వివాదాలు రాకుండా రైతుల భూములకు శాశ్వత రక్షణ లభిస్తుంది.

టెక్నికల్ నాలెడ్జిని భూ పరిపాలనలో భాగం చేయడం ద్వారా రైతుల ల్యాండ్స్‌కు డిజిటల్ సెక్యూరిటీ దొరకడమే కాకుండా, రాబోయే తరాలకు ఆస్తుల భద్రతపై ఒక స్పష్టమైన భరోసా దక్కుతుంది.

Potato Juice : పొటాటో జ్యూస్‌తో నిజంగా లాభాలుంటాయా? ఈ చిన్న తప్పు చేస్తే ప్రమాదమా?

Related Articles

Back to top button