Just Andhra PradeshJust TelanganaLatest News

Cyclone Alert : 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. రెండు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..

Cyclone Alert : బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. అక్టోబర్ 28వ తేదీన ఏపీ తీరం దాటనుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ జారీ చేసిన హెచ్చరికల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Cyclone Alert

తెలుగు రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మెల్లగా బలపడుతూ అతి తీవ్ర తుపానుగా (Very Severe Cyclonic Storm) రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ (IMD) ఎమర్జెన్సీ బులెటిన్ రిలీజ్ చేసింది. ఈ తుపాను ప్రయాణ దిశ, తీవ్రతను కంటిన్యూగా పర్యవేక్షిస్తున్న అధికారులు, రాబోయే 72 గంటలు 2 రాష్ట్రాలకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ తుపాను(Cyclone Alert )అక్టోబర్ 28వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్య బాపట్ల , విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ – యానాం తీరప్రాంతం సమీపంలో తీవ్ర రూపంలో తీరం దాటే అవకాశాలున్నాయి. ఆ టైమ్‌లో సముద్రం తీవ్రంగా అలజడికి గురికావడంతో పాటు, తీరం దాటే వేళ గంటకు 115- 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిసార్లు ఇవి గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ప్రమాదముందని తెలుస్తోంది

ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ,నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో ఈరోజు నుంచి మత్స్యకారులను అక్టోబర్ 28 వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లకూడదని కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందుగానే అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

ఈ తుపాను(Cyclone Alert )సెగ పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కూడా తాకనుందని వాతావారణశాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతం నుంచి వీచే తేమగాలుల వల్ల తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలలో వాతావరణం మేఘావృతమై ఉండటమే కాకుండా.. ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే వీలుంది.

తీర ప్రాంతాల ప్రజలతో పాటు, పల్లెలు, సిటీల్లో ఉన్నవారు కూడా గాలుల ఉధృతికి చెట్లు, పాత గోడలు, కరెంట్ స్తంభాలు, పవర్ లైన్ల కింద నిలబడొద్దని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి వీలుగా తాగునీరు, నిత్యావసరాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని సూచించారు.

Overly Emotional : ప్రతీ దానికి నొచ్చుకునే మనస్తత్వం..అతిగా ఫీలయ్యేవారి మైండ్ సెట్ వెనుకున్న సైకాలజీ ..

Related Articles

Back to top button