Just Andhra PradeshLatest News

Cyclone : బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడ్రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు..

Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Cyclone

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా భానుడి ప్రతాపం దానికి తోడు విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ముఖ్యంగా కష్టపడి పంటలు సాగుచేసిన రైతాంగం సరైన వర్షాలు లేకపోవడంతో.. ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం సీజన్ ఎండ్ అయినా కూడా ఎల్‌నినో ఎఫెక్ట్‌తో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో.. చేతి వరకూ వచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది.

ఇలాంటి సమయంలో ఏపీ ప్రజలకు, రైతులకు కాస్త రిలీఫ్ కలిగించేలా వాతావరణ శాఖ అధికారులు ఒక కీలక సమాచారాన్ని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ(Cyclone) శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో చిరు జల్లులు కరిసే అవకాశం ఉంది.

Cyclone
Cyclone

దీనికి తోడు రేపటి లోగా బంగాళాఖాతంలో కొత్తగా ఒక అల్పపీడనం(Cyclone) ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇది గనుక బలపడి వాయుగుండంగా మారి ఏపీ వైపునకు వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి నీటి కొరత తీరే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వర్షాల సమయంలో ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలతో పాటు, సామాన్య ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల వద్ద కానీ నిలబడకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

One-Sided Warnings : రిలేషన్‌షిప్‌లో ఒకరే అడ్జస్ట్ అవుతున్నారా..బంధాన్ని బర్నౌట్ చేసే 5 వన్ సైడెడ్ వార్నింగ్స్..

Related Articles

Back to top button