Just Andhra PradeshLatest News

Jagan: జనాలు వస్తే కోర్టుకు రావక్కర్లేదు..  జగన్ లాజిక్ అదేనా ?

Jagan: ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు రాక తప్పదని గ్రహించిన వైసీపీ నేతలు ఈ టూర్ ను మామూలు హడావుడి చేయలేదు.

Jagan

తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్(Jagan) పై ఏళ్ళ తరబడి కేసుల విచారణ నడుస్తూనే ఉన్నాయి. సీబీఐ ఎప్పటికప్పుడు ఛార్జ్ షీట్లు వేయడం, కోర్టులో విచారణ , వాయిదాలు ఇలా అంతులేని కథగా సాగుతూనే ఉంది. ఈ కేసుల్లోనే అరెస్టయిన జగన్(Jagan) 16 నెలలు జైలులో ఉండి తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి తిరుగులేని విజయం సాధించారు. సీఎంగా ఉన్నప్పటకీ కేసుల విచారణ కొనసాగుతూనే ఉంది.

అయితే ముఖ్యమంత్రి కావడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. కానీ గత ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత వైఎస్ జగన్ మళ్లీ కోర్టు మెట్లెక్కారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో జడ్జి ముందు హాజరయ్యారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. వైఎస్ జగన్(Jagan) హైదరాబాద్ రావడం, పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వెనుక పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే వచ్చేది మాజీ సీఎం మాత్రమే.. కానీ కోర్టుకు వ్యకిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పదే పదే కోరినప్పటకీ విదేశీ పర్యటనకు వెళ్లే ముందు పెట్టిన షరతుకు తలొగ్గక తప్పలేదు. జడ్జి ముందు హాజరవ్వాల్సి వచ్చింది.

Jagan
Jagan

అయితే ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు రాక తప్పదని గ్రహించిన వైసీపీ నేతలు ఈ టూర్ ను మామూలు హడావుడి చేయలేదు. ఒక రేంజ్ లో జనసమీకరణకు ప్లాన్ చేశారు. మాజీ సీఎం కాబట్టి స్థానిక పోలీసులు ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇవ్వడం కామనే. అయితే తమ నాయకుడి కోసం అభిమానులు భారీగా తరలివస్తారని, ర్యాలీగా వెళతామని వైసీపీ పార్టీ తెలంగాణ పోలీసులకు ముందే సమాచారమిచ్చింది. కోర్టు వ్యవహారం కావడం, ఒకరోజు మాత్రమే హడావుడి ఉంటుందని పోలీసులు కూడా అంగీకరించారు.

జగన్ (Jagan)కోర్టుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వైసీపీ ముందే సోషల్ మీడియాలో అన్న వస్తున్నాడంటూ హడావుడి చేయడంతో వైఎస్ఆర్ అభిమానులు తరలివచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో పెద్దగా ఆంక్షలు ఉండకపోవడంతో వైసీపీ నేతలు, అభిమానులు హడావుడి చేశారు. నిజానికి వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా జనం వస్తారు. ఇప్పుడు కూడా వచ్చారు.

వైఎస్ జగన్ కు, వైసీపీకి కూడా కావాల్సిందిదే. ఎందుకంటే తాను ప్రతీసారీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైతే ఇంత హడావుడి, ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసులకు ఇబ్బంది, సాధారణ ప్రజలకు ఇబ్బంది అంటూ జగన్ తరపు లాయర్లు జడ్జి ముందు చెప్పేందుకు వీలుంటుంది.

ఒకవేళ న్యాయమూర్తి లోతుగా ఆలోచిస్తే మాత్రం జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. అదే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు, సెక్యూరిటీ సమస్యలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కే అవకాశముంటుంది. ఓవరాల్ గా జగన్ హైదరాబాద్ టూర్ లో జనసమీకరణ వెనుక అసలు కథ ఇదే అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button