Just Andhra PradeshJust PoliticalLatest News

Mudragada Daughter : గో బ్యాక్.. గో బ్యాక్..ముద్రగడ కుమార్తె అడ్డగింత.. ఉద్రిక్తత

Mudragada Daughter : తాను చనిపోయిన తర్వాత చూడటానికి కూడా క్రాంతిని రావొద్దని గతంలో ముద్రగడ కుటుంబ సభ్యులకు చెప్పడంతోనే ఇప్పుడు ఆమెను అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

Mudragada Daughter

కాపు ఉద్యమ నాయకుడు , మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిన్నఅంటే జూలై 14న హైదరాబాద్‌లో ముద్రగడ కన్నుమూశారు. ఈరోజు ఆయన స్వగృహానికి మృతదేహాన్ని తరలించగా.. కడసారి ముద్రగడ పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి అభిమానులు, రాజకీయ నాయకులు తరలి వస్తున్నారు.

అలాగే ముద్రగడ పద్మనాభం కుమార్తె(Mudragada Daughter) క్రాంతి తన తండ్రికి నివాళులు అర్పించడానికి కిర్లంపూడి వచ్చారు. అయితే ముద్రగడ అనుచరులు ఆమెను అడ్డుకున్నారు. గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తండ్రిని చివరిసారి చూడనివ్వాలంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే కుటుంబ సభ్యులు, అనుచరులు ఆమెను అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను ఆపడానికి ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో క్రాంతి వాగ్వాదానికి దిగారు. ముద్రగడ కుటుంబ సభ్యుల విజ్ఞప్తితోనే ఆమెను అడ్డుకున్నట్టు పోలీసులు చెప్పారు. తాను చనిపోయిన తర్వాత చూడటానికి కూడా క్రాంతిని రావొద్దని గతంలో ముద్రగడ కుటుంబ సభ్యులకు చెప్పడంతోనే ఇప్పుడు ఆమెను అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

కొంత కాలంగా ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె(Mudragada Daughter) క్రాంతి మధ్య రాజకీయ , కుటుంబపరమైన విభేదాలు నడుస్తున్నాయి. ముద్రగడ వైసీపీలో ఉండగా, ఆయన కుమార్తె క్రాంతి జనసేనకు మద్దతుగా రాజకీయ ప్రకటనలు చేయడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. ముద్రగడ కుమారుడు గిరి వైసీపీలో చురుగ్గా ఉన్నా సరే.. క్రాంతి మాత్రం జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ తండ్రి రాజకీయ విధానాలను వ్యతిరేకించారు.

Mudragada Daughter
Mudragada Daughter

అప్పట్లో తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కూడా క్రాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సరైన వైద్యం అందించకుండా ఎవరినీ కలవనీయకుండా బంధించారని క్రాంతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆరోపణలను ముద్రగడ తీవ్రంగా ఖండించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవమని, వయసు రీత్యా వచ్చే సమస్యలు తప్ప క్యాన్సర్ లేదని వివరణ ఇచ్చారు.

Relationship : బంధంలో ప్రేమ మాత్రమే సరిపోదు.. సైకాలజీ చెప్పే రిలేషన్‌షిప్ సూత్రాలు

Related Articles

Back to top button