Nandamuri Tejaswini : విశాఖ కొత్త మేయర్ ఎవరు? టాప్‌లో నందమూరి తేజస్విని పేరు..
Nandamuri Tejaswini : నందమూరి బాలకృష్ణ కూతురు,విశాఖ ఎంపీ శ్రీ భరత్ భార్య తేజస్వినికి.. వైజాగ్ ప్రజల్లో మంచి గుర్తింపు కలిగి ఉండటంతో ఆమె పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది.
Nandamuri Tejaswini
రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్నింగ్స్ తీసుకుంటాయో చెప్పడం కష్టం. మున్సిపల్ పోరు అనగానే కేవలం స్థానిక లీడర్స్ మాత్రమే బరిలో దిగుతారని.. తాజాగా ప్రకటించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోసం వీరి పేర్లే వినిపిస్తాయని అనుకుంటారు.
అయితే ఈసారి మేయర్ పీఠాన్ని జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ చేయడంతో, ఏపీ పాలిటిక్స్‌లోని టాప్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇప్పుడు విశాఖపైనే కన్నేశాయి. మేయర్ కుర్చీని దక్కించుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును చాటుకోవడానికి అధికార కూటమి పార్టీ, ఈసారి అయినా తమ ఉనికిని చాటుకోవడానికి వైసీపీ చెమటోడుస్తున్నాయి. పక్కా క్యాస్ట్ ఈక్వేషన్స్, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీనియర్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను సీన్లోకి దించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
సామాజిక వర్గాలు , ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, టీడీపీ శ్రేణుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. నందమూరి బాలకృష్ణ కూతురు,విశాఖ ఎంపీ శ్రీ భరత్ భార్య తేజస్వినికి(Nandamuri Tejaswini).. వైజాగ్ ప్రజల్లో మంచి గుర్తింపు కలిగి ఉండటంతో ఆమె పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది.
మరోవైపు పార్టీ ఆర్గనైజేషన్‌లో కింగ్ వంటి పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య, అలాగే ముక్కా శ్రావణి వంటి మాజీ కార్పొరేటర్ల పేర్లు కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కార్పొరేటర్లను గెలిపించుకోవడంతో పాటు సిటీని హ్యాండిల్ చేయగల సత్తా ఉన్నవారిని బరిలోకి దించడానికే టీడీపీ మొగ్గు చూపిస్తుంది.

మరోవైపు వైఎస్సార్సీపీ కూడా ఈ పోరును సీరియస్‌గా తీసుకుంది. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పేరును తెర మీదకు తీసుకు వచ్చి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆ ప్లేస్‌లో ఆమెతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భార్య హిమగౌరి పేరు కూడా రేసులో వినిపిస్తోంది.
వీరితో పాటు బీసీ కార్డ్ ప్లాన్ చేస్తే మాత్రం.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పేర్లను కూడా పరిశీలించే ఛాన్స్ ఉంది. గతంలో రాజాన రమణి, గొలగాని హరి వెంకట కుమారి తర్వాత ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ మూడోసారి మహిళా నేత చేతికి వెళ్లనుండటంతో.. రాబోయే జీవీఎంసీ ఎన్నికలు కాకరేపడం గ్యారంటీ అనిపిస్తోంది.





