TDP, Janasena, BJP Seats : ఏపీ స్థానిక సంస్థల సమరం.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనసేన, బీజేపీ, టీడీపీ పోటీ స్థానాలివే..
TDP, Janasena, BJP Seats : 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానాల కేటాయింపులో . మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ 78 చోట్ల పోటీ చేయబోతుండగా, జనసేన 21, బీజేపీ 7 స్థానాలలో పోటీ చేస్తాయి.
TDP, Janasena, BJP Seats
ఏపీలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సంబంధించి అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై పూర్తి క్లారిటీతో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలతో పాటు నగర పంచాయతీలతో కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి బలాబలాలను అలాగే అక్కడ రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ స్థానాల కేటాయింపులను చేశారు.
మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిని పరిశీలిస్తే, ఎక్కువ స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగుతుండగా, మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి కూడా తగిన ప్రాధాన్యం కల్పించారు. దీని ప్రకారం టీడీపీ 89 స్థానాల్లో (72.36 శాతం), జనసేన 25 స్థానాల్లో (20.33 శాతం), బీజేపీ 9 స్థానాల్లో (7.32 శాతం) తమ కేండిడేట్స్ను నిలబెట్టనున్నాయి.
ఇక చాలా ఇంపార్టెంట్ అయిన 17 మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 11 చోట్ల పోటీ చేయనుండగా, జనసేన 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలలో పోటీ చేస్తాయి. దీనిలో జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరుతో పాటు అత్యంత కీలకమైన విజయవాడ కార్పొరేషన్ను కేటాయించడం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. అదేవిధంగా బీజేపీకి రాజమహేంద్రవరంతో పాటు అనంతపురం కార్పొరేషన్లను కేటాయించారు.

ఇక 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానాల కేటాయింపులో . మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ 78 చోట్ల పోటీ చేయబోతుండగా, జనసేన 21, బీజేపీ 7 స్థానాలలో పోటీ చేస్తాయి. క్షేత్రస్థాయిలో పార్టీల ప్రభావం, గెలుపు గుర్రాల ఎంపికనే ప్రామాణికంగా తీసుకుని ఈ పొత్తుల సమీకరణాలను సెట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల సర్దుబాటు ప్రాసెస్ ప్రశాంతంగా ముగియడంతో కూటమి శ్రేణులు ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రచారంలోకి దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి.
Parallel Conversations : బంధాలలో పారలల్ కాన్వర్సేషన్స్..మీ సంభాషణలో ఈ పొరపాట్లు జరుగుతున్నాయా?





