Just BusinessLatest News

Gold:పసిడి ప్రియులకు షాక్..కొత్త ఏడాదిలో కూడా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold: బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా సామాన్యులకు భారీగానే షాక్ ఇచ్చింది.

Gold

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో ఉన్న సామాన్యులకు పసిడి(Gold) ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, ఈరోజు అంటే జనవరి 2న మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మార్పులతో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈరోజు ధరలు (Gold)ఇలా ఉన్నాయి.

  • నిన్న రూ.1,23,800 గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1,050 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,24,850 కు చేరుకుంది.
  • 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.1,35,060 గా ఉండగా ఈరోజు రూ.1,140 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200 వద్ద కొనసాగుతోంది.
  • బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా సామాన్యులకు భారీగానే షాక్ ఇచ్చింది. నిన్నతో పోలిస్తే ఈరోజు కిలో వెండిపై ఏకంగా రూ.4,000 పెరిగింది.
  • ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,60,000 గా ఉంది. వెండిలో ఇలాంటి భారీ పెరుగుదల తాము చూడలేదని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.
Gold price
Gold price

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటంటే కొత్త ఏడాదిలో చాలామంది పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపించడం అలాగే డాలర్ విలువలో మార్పులు , స్టాక్ మార్కెట్ల అనిశ్చితి వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.

దీనికి తోడు మన దేశంలో త్వరలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటతో అప్పుడు ధరలు ఎలా ఉంటాయోనని కొంతమంది ఇప్పుడే కొని పెట్టుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు.దీంతోనే బంగారం , వెండి ధరలు డిమాండ్ పెరిగి, ధరలు కూడా పెరుగుతున్నాయని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button