Gold price : భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?
Gold price : బెంగళూరు, ముంబై వంటి చోట్ల కిలో వెండి ధర సుమారు రెండు లక్షల 65 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ కాస్త తక్కువ ధరే పలుకుతోంది.
Gold price
బంగారం కొనాలనుకుంటున్న సామాన్యులకు బుధవారం అంటే ఏప్రిల్ 22న ఒక శుభవార్త అందింది. కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరల్లో ఈరోజు స్వల్ప ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్ల అటు బులియన్ మార్కెట్లలోనూ, ఇటు స్థానిక నగరాల్లో కూడా పుత్తడి, వెండి ధరలలో మార్పులు కనిపించాయి. ఈరోజు ధరల వివరాలను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్నంలో గోల్డ్ ధర(Gold price )లు ఒకేలా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర(Gold price ) 1, 41, 850 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1, 54 , 750 రూపాయలుగా నమోదైంది. తక్కువ బడ్జెట్లో జ్యువెలరీ చేయించుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉండే 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1, 16, 600 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడ,విశాఖపట్నం
లో కూడా సరిగ్గా ఇవే ధరలు అమలవుతున్నాయి.
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చి చూస్తే మాత్రం ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఒక లక్షా 54 వేల 900 రూపాయలుగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ఒక లక్షా 42 వేల రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో ధరలు మిగిలిన నగరాల కంటే కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి. 24 క్యారెట్ల పసిడి ఒక లక్షా 55 వేల 990 రూపాయలు పలుకుతుండగా, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో హైదరాబాద్ తరహాలోనే ధరలు స్థిరంగానే ఉన్నాయి.

ఇక సిల్వర్ ధరల విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా వీటి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ , విశాఖపట్నం నగరాల్లో కిలో సిల్వర్ ధర రెండు లక్షల 74 వేల 900 రూపాయల వద్ద ఉంది. అయితే బెంగళూరు, ముంబై వంటి చోట్ల కిలో వెండి ధర సుమారు రెండు లక్షల 65 వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ కాస్త తక్కువ ధరే పలుకుతోంది.
సాధారణంగా పండుగలు , పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరిగే అవకాశం ఉన్నా కూడా, ఈరోజు ధరల్లో ఈ రకమైన తగ్గుదల కనిపించడం కొనుగోలుదారులకు , పెట్టుబడిదారులకు మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, ముడి చమురు ధరలు, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు ఈ బంగారం ధరలను ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే.
Money Plant :మనీ ప్లాంట్ను ఇలాంటి పాత్రలలో నాటితే కష్టాలు తప్పవు..ఈ వాస్తు టిప్స్ మీకోసమే





