Gold Price Today : 2 రోజుల పతనం తర్వాత మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు..
Gold Price Today : ఆల్ టైమ్ రికార్డుల నుంచి కాస్త రిలీఫ్ లభించిందని సంతోషించే లోపే, బులియన్ మార్కెట్లో బంగారం , వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పైకి లేచాయి.
Gold Price Today
రెండు రోజుల పాటు గోల్డ్ లవర్స్‌కు ఊరటనిస్తూ కిందికి దిగివచ్చిన పసిడి, వెండి గ్రాఫ్‌లు బుధవారం ఉదయాన్నే సడన్‌గా యూ-టర్న్ తీసుకున్నాయి. ఆల్ టైమ్ రికార్డుల నుంచి కాస్త రిలీఫ్ లభించిందని సంతోషించే లోపే, బులియన్ మార్కెట్లో ధరలు మళ్లీ స్వల్పంగా పైకి లేచాయి.
అంతర్జాతీయ మార్కెట్లోని హెచ్చుతగ్గులు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, చేతులు మారుతున్న ముడిచమురు రేట్లు, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువలోని చేంజెస్‌తో పాటు లోకల్ మార్కెట్లో ఉండే డిమాండ్ మరియు సప్లై సమీకరణాలు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలను పరుగులు తీయిస్తున్నాయి.
హైదరాబాద్‌లో మంగళవారం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 1లక్ష51వేల720 వద్ద ముగియగా, బుధవారం రోజు(Gold Price Today) ఏకంగా రూ. 690 జంప్ చేసి రూ. 1లక్ష52వేల400 మార్కుకు చేరుకుంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు,గుంటూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక జ్యువెలరీ తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రాముల ధరను చూస్తే అది రూ. 1లక్ష36వేల400 వద్ద ట్రేడవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం 4,173 డాలర్ల వద్ద రన్ అవుతోంది.

మరోవైపు పుత్తడి దారినే అనుసరిస్తూ సిల్వర్ కూడా తన రేటును స్వల్పంగా పెంచుకుంది. మంగళవారం రోజు మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 2లక్షల27వేల802గా ఉండగా, బుధవారం రోజుకు రూ. 190 వరకూ స్వల్పంగా పెరిగి రూ. 2లక్ష27వేల992కి చేరింది. గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఔన్స్ స్పాట్ వెండి కాస్ట్ 60.99 డాలర్ల మార్కు వద్ద కొనసాగుతోంది. ఇలా రోజువారీ మార్కెట్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ పసిడి ప్రియులను, ఇన్వెస్టర్లను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.





