Just BusinessLatest News

Gold Prices : 2 లక్షలకు చేరుతుందా.. లక్షకు దిగొస్తుందా ?…బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు

Gold Prices : అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, యుద్ధ వాతావరణం, ఇతరత్రా కారణాలతో బంగారం ధర ఏడాదిన్నరలో ఏకంగా రెట్టింపు దాటిపోయింది

Gold Prices

గత ఏడాదిన్నర కాలంగా బంగారం ధరల్లో(Gold Prices) వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, యుద్ధ వాతావరణం, ఇతరత్రా కారణాలతో బంగారం ధర ఏడాదిన్నరలో ఏకంగా రెట్టింపు దాటిపోయింది. గత ఏడాది జనవరిలో 80 వేలు ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఇవాళ రూ.1,51,000 వేలు దాటింది. నిజానికి ఒక దశలో రూ.2 లక్షలు దాటిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి.

కానీ అదేమీ జరగలేదు. అదే సమయంలో లక్షకు దిగి వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. అది కూడా జరగలేదు. అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇవాళ ఉన్న ధరలు రేపు ఉండడం లేదు. ఒకరోజు బాగా పెరిగితే.. మరోరోజు అనూహ్యంగా తగ్గుతున్నాయి.

దీంతో సామాన్య కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో తీవ్ర అయోమయం నెలకొంది. గత రెండు వారాలుగా నిలకడగా ఉన్న గోల్డ్ ధరలు ట్రంప్ కాల్పుల విరమణతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అసలు ఎందుకు ఇంత తీవ్రఒడిదుడుకులు ఏర్పడుతున్నాయన్న చర్చ జరుగుతోంది.

సుక్షితమైన పెట్టుబడిగా భావించే ఇన్వెస్టర్లు బంగారాన్ని కొంటుంటారు. దీంతో డిమాండ్ పెరిగి పసిడి ధరలు పైపైకి వెళుతుంటాయి. ఇటీవల కొన్ని రోజులు బంగారం ధరలు భారీగా పడిపోవడం ఇన్వెస్టర్లకు తీవ్ర నిరాశను కలిగించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మార్చి మధ్యలో బంగారం ధరలు 27 శాతం మేర తగ్గాయి.

Gold Prices
Gold Prices

ఇప్పుడు మళ్లీ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇంకా పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. 2026 చివరికల్లా దేశంలో పసిడికి డిమాండ్ 43 శాతానికి చేరుతుందని అంచనా. అదే జరిగితే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.2 లక్షలు దాటుతుంది. ఈ పెరుగుతున్న రేటు కారణంగా వినియోగదారులు నగల రూపంలో బంగారం కొనేందుకు అంతగా ఇష్టపడడం లేదు. అయితే పెట్టుబడిగా మాత్రం కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

బంగారం నాణ్యతతో పాటు దిగుమతి సుంకాలు, పన్నురేట్లు, స్థానిక డిమాండ్‌ వంటివి కూడా ధరల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరికల్లా రూ.1,75,000 నుంచి రూ.2 లక్షల వరకూ గోల్డ్ రేట్ చేరొచ్చని తెలుస్తోంది.

Credit Card : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 6 తప్పులు అస్సలు చేయొద్దు..

Related Articles

Back to top button