Gold Rates : రాఖీ పండగ వేళ పసిడి ధమాకా..ఒక్కరోజే రెండుసార్లు క్రాష్ అయిన గోల్డ్ రేట్లు..
Gold Rates : శుక్రవారం ఒక్కరోజే కేవలం 4 గంటల వ్యవధిలో రెండుసార్లు రేట్లు క్రాష్ అవ్వడం నిజంగా బంగారం లాంటి వార్తే.
Gold Rates
గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ కొనాలనుకునేవారికి, బంగారం లాంటి మనసున్న పుత్తడి ప్రియులకు రాఖీ పౌర్ణమి పండుగ రోజు మార్కెట్ అదిరిపోయే సర్ప్రైజ్ను అందించింది. కొన్ని రోజులుగా అంతెందుకు కొన్ని గంటల క్రితం కూడా ఆకాశాన్ని తాకుతున్నాయా అనేలా పరుగులు పెట్టిన పసిడి ధరలు.. కిందికి దిగొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఇంకో ఇంట్రస్టింగ్ విషయమేమిటంటే, శుక్రవారం ఒక్కరోజే కేవలం 4 గంటల వ్యవధిలో రెండుసార్లు రేట్లు క్రాష్ అవ్వడం నిజంగా బంగారం లాంటి వార్తే. శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల వరకు 10 గ్రాముల బంగారంపై రూ. 1,000 వరకు ధర తగ్గగా , ఉదయం 10 గంటలు దాటాక ఏకంగా రూ. 3,160 భారీగా తగ్గి షాక్ ఇచ్చింది.
పుత్తడి బాటలోనే నడుస్తూ వెండి కూడా కొనుగోలుదారులకు భారీ ఊరటను ఇచ్చింది. నిన్నటి వరకూ నింగినంటిన సిల్వర్ ధరలు ఇవాళ ఒక్కరోజే కిలోపై ఏకంగా రూ. 5,000 వరకూ పడిపోయాయి. దీంతో నిన్న కేజీ రూ. 2లక్షల64వేల900గా ఉన్న వెండి ధర, హైదరాబాద్లో ప్రస్తుతం రూ. 2లక్షల60వేల వద్ద కొనసాగుతుంది. ఇక నేషనల్ మార్కెట్లోకి వెళ్లి చూస్తే కేజీ సిల్వర్ ధర రూ. 2లక్షల55వేలలో దొరుకుతుంది.
హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 6 గంటలకు రూ. 1లక్ష62వేల970 వద్ద ఉన్న 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పుత్తడి ధర, ఇప్పుడు రూ. 1లక్ష59వేల820కి దిగివచ్చింది. అదేవిధంగా జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ. 1లక్ష49వేల390 ఉండగా, ప్రస్తుతం రూ. 1లక్ష46వేల500కి తగ్గింది.
ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1లక్ష19వేల870 దగ్గర కొనసాగుతోంది. కేవలం నాలుగు గంటల స్వల్ప వ్యవధిలోనే 10 గ్రాములపై ఏకంగా రూ. 3,160 తగ్గిపోవడంతో కొనుగోలుదారులు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన వరంగల్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ముంబై, బెంగళూరులోనూ సరిగ్గా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అక్కడ కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ. 1లక్ష62వేల970 నుంచి రూ. 1లక్ష59వేల820కి పడిపోగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష49వేల390 నుంచి రూ. 1లక్ష46వేల500కి చేరింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా హైదరాబాద్ లాగే ఉదయం రూ. 1లక్ష62వేల970గా ఉన్న తులం పసిడి రూ. 1లక్ష59వేల820కి తగ్గుముఖం పట్టింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో మాత్రం ఈ ధరల్లో కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 1,59,870గా నడుస్తుండగా, 22 క్యారెట్ల పసిడి రూ. 1లక్ష46వేల500 వద్ద ట్రేడ్ అవుతోంది.





