Just BusinessJust NationalLatest News

Gold Price : పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త..3 రోజుల్లోనే రూ. 6 వేలకు పైగా డౌన్..

Gold Price : మూడు, నాలుగు రోజులుగా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్న బులియన్ మార్కెట్.. సోమవారం రోజు ఒక్కసారిగా భారీ పతనాన్ని నమోదు చేసింది.

Gold Price

గోల్డ్ లవర్స్‌కు , బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే రిలీఫ్ ఇస్తూ.. పసిడి, వెండి రేట్లు దారుణంగా పడిపోయాయి. మూడు, నాలుగు రోజులుగా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్న బులియన్ మార్కెట్.. సోమవారం రోజు ఒక్కసారిగా భారీ పతనాన్ని నమోదు చేసింది. ఏకంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కేవలం 3 రోజుల్లోనే ఏకంగా రూ. 6,000 పైగా కోత పడటంతో మార్కెట్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో శనివారం రోజున 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష61వేల410 వద్ద ఉండగా.. సోమవారం ఉదయానికి పరిస్థితి తలకిందులైంది. ఒక్కరోజే ఏకంగా రూ. 6,860 పడిపోయి రూ. 1లక్ష54వేల550కి చేరుకుంది.

జ్యువెలరీ కోసం వాడే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ. 1లక్ష45వేల050 వద్ద ట్రేడ్ అవుతోంది. తెలంగాణలోనే కాదు ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు వంటి మెయిన్ సిటీల్లో కూడా సరిగ్గా ఇలాగే ధరలు దిగొచ్చాయి.

Gold Price
Gold Price

బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా మార్కెట్‌లో కొనుగోలుదారులకు బాగానే రిలీఫ్ ఇచ్చింది. శనివారం కేజీ వెండి ధర రూ. 2లక్షల44వేల50 వద్ద ఉండగా, సోమవారం ఏకంగా రూ. 10వేల600 ధనాధన్ తగ్గి రూ. 2లక్షల33వేల450కి పడిపోయింది. అంటే రెండు మూడు రోజుల్లోనే వెండిపై పది వేలకు పైగా తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లోనూ దీని ప్రభావం క్లియర్‌గా కనిపిస్తోంది.

అయితే బంగారం కొన్నప్పుడు పక్కాగా జీఎస్టీ బేస్డ్ ట్యాక్స్ బిల్లు తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆ బిల్లులో పుత్తడి నికర బరువు, ప్యూరిటీ , ఆరోజు ధర, మేకింగ్ ఛార్జీలు విడివిడిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మీరు కొనే జ్యువెలరీపై బీఐఎస్ (BIS) హాల్‌మార్క్ ముద్ర ఉందో లేదో చెక్ చూసుకోవాలి.

Chutney : ఇడ్లీ, దోసల్లోకి కమ్మటి పల్లీ చట్నీ..హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి..

Related Articles

Back to top button