Just BusinessLatest News

Gold Rates : పసిడి ప్రియులకు ఊరట.. దిగొస్తున్న పసిడి ధరలు

Gold Rates : ఈ మధ్య కాలంలో అటూ ఇటూ ఊగిసలాడుతున్న పుత్తడి ధరలు.. ఈ వారం ప్రారంభం నుంచీ బాగానే తగ్గుముఖం పడుతున్నాయి.

Gold Rates

గోల్డ్ కొనాలనుకునే వారికి నిజంగానే సూపర్ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో అటూ ఇటూ ఊగిసలాడుతున్న పుత్తడి ధరలు.. ఈ వారం ప్రారంభం నుంచీ బాగానే తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం మార్కెట్లో సుమారు రూ.1500 వరకూ తగ్గిన గోల్డ్ రేట్లు, మంగళవారం కూడా అదే బాటలో పయనించడంతో గోల్డ్ లవర్స్ ఖుషీ అవుతున్నారు.

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే పొలిటికల్, ఆర్థిక పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు(Gold Rates)కుప్పకూలడంతో, దేశీయంగా కూడా గోల్డ్ ధరలు భారీగా దిగొచ్చాయి.

ప్రధాన నగరాల్లో మంగళవారం రోజు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధరల వివరాలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర(Gold Rates) రూ.1 లక్ష42వేల 800 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1లక్ష30వేల900గా నమోదైంది.

బెంగళూరులోనూ సరిగ్గా ఇవే ధరలు అంటే 24 క్యారెట్లు రూ.1లక్ష42వేల800, 22 క్యారెట్లు రూ.1 లక్ష30వేల900 కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1లక్ష42వేల950 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1లక్ష31వేల50 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్లపై రూ.540 తగ్గి రూ.1లక్ష43వేల460కి చేరగా, 22 క్యారెట్లపై రూ.500 తగ్గి రూ.1లక్ష31వేల500 వద్ద స్థిరపడింది.

Gold Rates
Gold Rates

గోల్డ్‌తో పాటే సిల్వర్ ధరలు కూడా కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయికి చేరిన వెండి ధరలు మంగళవారం దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో సోమవారం కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా ఉండగా, ఈరోజు ఏకంగా రూ.5,000 పతనమై రూ.2.35 లక్షల వద్దకు వచ్చేసింది.

ఇటు ఢిల్లీ, అటు బెంగళూరు మార్కెట్లలో కూడా కిలో వెండి ధర రూ.2.35 లక్షల వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వల్ల రాబోయే రోజుల్లో..బంగారం, వెండి ధరల్లో మరికొన్ని మార్పులు వచ్చే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Turmeric Powder : కల్తీ పసుపును కనిపెట్టేయండిలా..5 ఈజీ టెస్టులివే..

Related Articles

Back to top button