Just BusinessJust NationalLatest News

UPI : నో యూపీఐ డే నిరసనలకు దిగొచ్చిన ఎన్‌పీసీఐ..షాక్‌లో పేటీఎం, మొబిక్విక్..

UPI : సంవత్సరానికి రూ.40 లక్షల లోపు టర్నోవర్ ఉండే చిన్న చిన్న బిజినెస్‌లకు ఈ ఎండీఆర్ రూల్స్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది.

UPI

దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్ యూజర్లు, చిన్న కిరాణా బడ్డీ నుంచి పెద్ద మాల్‌ వరకూ చేసే డిజిటల్ చెల్లింపుల విషయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మనం డైలీ చేసే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ట్రాన్జాక్షన్స్‌పై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పేరుతో ఎక్స్‌ట్రా ఫీజులు విధించే డెసిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా యూటర్న్ తీసుకునేలా పరిస్థితులు మారాయి.

నిజానికి అక్టోబర్ 15వ తేదీ నుంచే ఈ ఛార్జీల బాదుడు స్టార్ట్ కావాల్సి ఉండగా, దానిని ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 1 వరకు పోస్ట్‌పోన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల సీజన్ ముందు హోల్‌సేల్ అండ్ రిటైల్ వ్యాపారుల జేబులపై ఎక్స్‌ట్రా బర్డెన్ పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఉపశమన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యూపీఐపై కేంద్రప్రభుత్వం ఎండీఆర్ ఫీజులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని వ్యాపారులంతా ఏకమై అక్టోబర్ 2వ తేదీన నో యూపీఐ(UPI) డే పేరుతో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పండుగల సేల్స్ టైమ్‌లో ఈ ఎక్స్‌ట్రా ఛార్జీలు పడితే కస్టమర్లు వెనకడుగు వేస్తారని, తమ బిజినెస్‌ దారుణంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దాంతో ఎన్‌పీసీఐ (NPCI) స్టీరింగ్ కమిటీ అర్జంటుగా రంగంలోకి దిగి అమలయ్యే డేట్‌ను వెనక్కి జరపడమే కాకుండా..సంవత్సరానికి రూ.40 లక్షల లోపు టర్నోవర్ ఉండే చిన్న చిన్న బిజినెస్‌లకు ఈ ఎండీఆర్ రూల్స్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది.

UPI
UPI

అయితే ఈ ఎండీఆర్ పోస్ట్‌పోన్ న్యూస్ బయటకు రాగానే దలాల్ స్ట్రీట్‌లో సీన్ రివర్స్ అయింది. యూపీఐ(UPI) ట్రాన్జాక్షన్లపై రుసుముల ద్వారా కొత్తగా పెద్ద ఎత్తున రాబడి వస్తుందని ఆశపడ్డ ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురవడంతో పేమెంట్ అగ్రిగేటర్ల షేర్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి.

పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ షేరు ఏకంగా 10 పర్సంటేజ్‌ పడిపోయి, ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్ల మార్కు కిందకు పడిపోయింది. అంతేకాదు మొబిక్విక్ షేరు 8 పర్సంటేజ్‌ డౌన్ అవగా అలాగే పైన్ ల్యాబ్స్ షేరు 4 శాతానికి పైగా నష్టాల్లోకి కూరుకుపోయింది.

ఒకవైపు పండుగల సమయంలో వ్యాపారులకు ఇది పెద్ద రిలీఫ్ న్యూసే అయినా ..ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లకు మాత్రం ఈ డెసిషన్ మింగుడుపడని పెద్ద షాకింగ్ వార్తలా మారింది.

No UPI Day : అక్టోబర్ 2న డిజిటల్ షాక్.. ఆ ఒక్క కొత్త రూల్‌తో ఎవరికి ఇబ్బంది?

Related Articles

Back to top button