UPI Payments : యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీల మోత హోల్డ్..
UPI Payments : వ్యాపారుల నుంచి వచ్చిన రిక్వెస్టులతో ప్రతిపాదిత ఛార్జీల అమలును టెంపరరీగా పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది.
UPI Payments
డైలీ లైఫ్‌లో యూపీఐ పేమెంట్స్ భాగంగా అయిపోయిన తర్వాత సడన్‌గా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు అన్న వార్త ఇటీవల అందరి గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టేలా చేసింది. అయితే దానిపై ఇప్పుడు ఎన్పీసీఐ బ్యాక్ స్టెప్ తీసుకోవడంతో వ్యాపారులకు పండుగ ముందు గుడ్ న్యూస్ వినిపించినట్లు అయింది.
ఇటీవల యూపీఐ మర్చెంట్ ట్రాన్జాక్షన్లపై(UPI Payments) ఎండీఆర్ ఛార్జీలు బాదబోతున్నారనే న్యూస్ రిటైల్ వ్యాపారులకు నిద్రలేకుండా చేసింది. పండుగ బిజినెస్ జోరుగా సాగే ఈ టైమ్‌లో.. ఈ అదనపు భారం తమ లాభాలను దెబ్బతీస్తుందని వారంతా ఆందోళన చెందారు.
దీంతో అప్రమత్తమైన ఎన్పీసీఐ.. వ్యాపారుల నుంచి వచ్చిన రిక్వెస్టులతో ఈ ప్రతిపాదిత ఛార్జీల అమలును టెంపరరీగా పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ రెండో వారం లేదంటే దీపావళి తర్వాతే దీనిపై స్పష్టమైన డేట్‌ను ప్రకటిస్తామని చెప్పింది.
యూపీఐ సిస్టం సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ, సర్వర్ మెయింటెనెన్స్ కోసం ఈ ఛార్జీలు అవసరమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కూడా, పండగ సమయంలో తీసుకున్న ఈ టెంపరరీ వాయిదా డెసిషన్ మాత్రం వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చినట్లు అయింది.

వ్యక్తుల మధ్య జరిగే పీ2పీ లావాదేవీలు , రోజువారీ చిన్న చిన్న బిజినెస్ ట్రాన్జాక్షన్స్ ఎప్పటిలాగే ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా ఫ్రీగానే సాగిపోతాయని క్లారిటీ రావడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు.
నవంబర్ తర్వాత దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అని ఇప్పుడు టెక్ అండ్ బిజినెస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ పేమెంట్స్(UPI Payments)పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం..మళ్లీ ఛార్జీల మోత నిర్ణయం తీసుకోకుండా ఉండాలని వ్యాపారులు కోరుతున్నారు.





