Just CrimeJust TechnologyLatest News

Petition Against OpenAI : భర్త హత్యకు చాట్‌జీపీటీ కుట్ర?.. ఏఐ మాస్టర్ ప్లాన్ వేసిందని కేసు..

Petition Against OpenAI : భార్య తనను చంపడానికి చాట్‌జీపీటీ సాయంతో విష ప్రయోగ ప్లాన్ వేసిందని ఆరోపిస్తూ నార్త్ కరోలినాకు చెందిన వ్యక్తి ఓపెన్ఏఐ, సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై కోర్టులో దావా వేశాడు.

Petition Against OpenAI

అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూ అల్లుకున్న ఒక నమ్మశక్యం కాని ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డైవోర్స్ వివాదంలో ఉన్న తన భార్య తనను మర్డర్ చేయడానికి ప్రయత్నించిందని, ఈ ప్రాణాంతక కుట్రకు చాట్‌జీపీటీ(Petition Against OpenAI) పూర్తి ప్లాన్‌ను అందించిందని ఆరోపిస్తూ ఒక వ్యక్తి శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐ కంపెనీపై పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ అయిన విషయమేంటంటే, ఈ కేసులో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ను కూడా డైరెక్టుగా ప్రతివాదిగా చేర్చడం గ్లోబల్ వైడ్‌గా చర్చనీయాంశమైంది.

‘బ్లూమ్‌బర్గ్’ కథనంలో వచ్చిన వివరాల ప్రకారం.. నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన జేమ్స్ గేట్స్,అతని భార్య చెరిల్ గేట్స్ కొన్నాళ్లుగా డైవోర్స్ కోసం అప్లై చేసుకోగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సమయంలో జేమ్స్ తీవ్రమైన కడుపునొప్పి, హార్ట్ రిలేటెడ్ సమస్యలు, సడన్‌గా స్పృహ తప్పడం వంటి సడన్‌ అనారోగ్య లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత 2025 సెప్టెంబర్‌లో జేమ్స్‌కు తన భార్యకు చెందిన ఒక చేతిరాత నోట్ లభించింది. అందులో కొన్ని డేంజరస్ పాయిజన్స్ పేర్లు, వాటిని ఎంత మోతాదులో ఇవ్వాలనే వివరాలతో పాటు చాట్‌జీపీటీ చాట్స్ డిలీట్ చేయి, లాగ్ అవుట్ అవ్వు అంటూ రాసి ఉండటంతో విషప్రయోగ కుట్ర వెలుగులోకి వచ్చింది.

ఈ కేసు ఎంక్వైరీలో భార్య చెరిల్ చాట్‌జీపీటీని ఎలా దుర్వినియోగం చేసిందో తెలిపే అంశాలన్నీ కూడా ఆధారాలతో సహా బయటపడ్డాయి. మొదట్లో సాధారణ పనులకు చాట్‌బాట్‌ను వాడిన ఆమె, తర్వాత తమ మ్యారీడ్ లైఫ్‌లోని విభేదాలను దాంతో పంచుకుంది. ఈ సమయంలోనే ఒలియాండర్ అనే విషపూరిత మొక్క గురించిన వివరాలు, అది ఎంత మోతాదులో ఇస్తే ప్రాణాంతకమవుతుంది, దాని టేస్ట్‌ తెలీకుండా ఫుడ్‌లో ఎలా కలపాలి, పోస్ట్ మార్టమ్ (Autopsy) రిపోర్ట్‌లో అది దొరుకుతుందా లేదా అనే విషయాలపై చాట్‌జీపీటీ(Petition Against OpenAI) ఆమెకు గైడెన్స్ ఇచ్చింది. ఆ చాట్ స్క్రీన్‌షాట్‌లన్నిటినీ జేమ్స్ కోర్టుకు సమర్పించారు.

మొదట పోలీసులకు కంప్లైంట్ చేయగా 2025లో చెరిల్‌పై కేసు నమోదు చేసినా, పక్కా సాక్ష్యాలు చాలలేవనే రీజన్‌తో 2026 ఏప్రిల్‌లో ప్రాసిక్యూటర్లు ఆమెపై అభియోగాలను కొట్టివేశారు. దీంతో జేమ్స్ డైరెక్టుగా ఓపెన్ఏఐ పైనే చట్టపరమైన పోరాటానికి దిగారు. ఈ అంశంపై ఓపెన్ఏఐ రియాక్ట్ అవుతూ.. వినియోగదారుల సేఫ్టీకి తాము చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని, విచారణాధికారులకు పూర్తి ఇన్ఫో అందించి ఆ యూజర్ అకౌంట్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి పర్మనెంట్‌గా బ్యాన్ చేశామని తెలిపింది. యూజర్లు చేసే నేరాలకు టెక్నికల్ కంపెనీలుగా తమకు బాధ్యత ఉండదనే ఏఐ కంపెనీల వాదన మధ్య ఈ కేసు కొత్త చట్టపరమైన చర్చకు తెరలేపింది.

SmartPhone Prices : మొబైల్స్‌పై ఏఐ ఎఫెక్ట్.. 30 శాతం వరకు పెరగనున్న ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు

Related Articles

Back to top button