Just EntertainmentLatest News

Aamir Khan : మొన్న సల్మాన్ ఇప్పుడు అమీర్ ఖాన్‌..బాలీవుడ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గండం. .

Aamir Khan : అమీర్ ఖాన్ వంటి వాళ్లు భారత దేశంలో లవ్ జిహాద్‌ను ఎంకరేజ్ చేస్తున్నారని, ఇది హిందూ ధర్మానికి అస్సలు మంచిది కాదని చెబుతూ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఒక ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Aamir Khan

బాలీవుడ్ బడా స్టార్స్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ వరసగా టార్గెట్ చేస్తోందనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిన్నటిదాకా సల్మాన్ ఖాన్ వెనుక పడ్డ ఈ గ్యాంగ్.. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌(Aamir Khan)పై కన్నేసినట్లు తెలుస్తోంది. గౌరీ స్ప్రాట్‌తో అమీర్ ఖాన్ చేసుకున్న మూడో పెళ్లి ఈ గ్యాంగ్‌కు అస్సలు నచ్చలేదని.. ఇది లవ్ జిహాద్ అని బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో అమీర్‌ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్, ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ అని చెప్పుకుంటూ కొందరు ఆ ఆడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ వంటి వాళ్లు భారత దేశంలో లవ్ జిహాద్‌ను ఎంకరేజ్ చేస్తున్నారని, ఇది హిందూ ధర్మానికి అస్సలు మంచిది కాదని చెప్పుకొచ్చారు.

స్టార్‌డమ్ ఉందని ఇలా ఇష్టమొచ్చినట్లు చేస్తే తాము ఊరుకోమని, తమ స్టైల్‌లోనే త్వరలోనే అమీర్‌కు బుద్ధి చెబుతామంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా రాజస్థాన్ శ్రీ గంగానగర్ ఇష్యూని కూడా హైలైట్ చేసిన ఈ ముఠా.. అక్కడ ఒక అమ్మాయిపై జరిగిన దారుణంపైనా మాట్లాడారు. ఈ కేసులో నిందితులను కాపాడాలని చూస్తున్న కొంతమంది రాజకీయనేతలకు వార్నింగ్ ఇస్తూ, మధ్యలోకి వస్తే మీ పని కూడా అవుతుందంటూ బెదిరించారు.

Aamir Khan
Aamir Khan

అయితే ఈ వార్తలపై అమీర్ ఖాన్ టీమ్ గానీ, పోలీసులు గానీ ఇప్పటివరకు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ప్రెజెంట్ అమీర్ తన వైఫ్‌తో కలిసి మెల్‌బోర్న్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఆస్ట్రేలియా టూర్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ముంబయి పోలీసులు, సైబర్ సెల్ ఈ ఆడియో క్లిప్స్‌పై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

కాగా ఈ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో ఏకంగా కెనడా పోలీసులకే లెటర్ రాసి వార్నింగ్ ఇచ్చారు. తమ దగ్గర వెయ్యి మందికి పైగా షూటర్లు ఉన్నారని చెబుతూ, కెనడా పోలీస్ స్టేషన్‌కే అప్పట్లో లెటర్ పంపి కలకలం రేపారు. మొత్తంగా ముంబయి నుంచి కెనడా దాకా విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు వింటేనే ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో వణుకు పుడుతుందని చెప్పొచ్చు.

Sonam Wangchuk : ఆసుపత్రికి లడఖ్ ఉద్యమకారుడు..వాంగ్‌చుక్ దీక్ష భగ్నంపై నిరసనకారుల ఆగ్రహం

Related Articles

Back to top button