Linen : లెనిన్‌కు పాజిటివ్ టాక్.. అఖిల్ కొత్త మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే ?

Linen : సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల జాబితాలో ముందుంటాడు అక్కినేని అఖిల్. నాగార్జున వారసుడిగా నాగచైతన్య నిలదొక్కుకున్నా.. అఖిల్‌కు మాత్రం సాలిడ్ హిట్ పడడం లేదు.

Linen

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది బ్యాక్ గ్రౌండ్‌గా మాత్రమే ఉపయోగపడుతుంది. అది సుదీర్ఘకాలం కాపాడలేదు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవాలంటే ఎప్పటికప్పుడు హిట్లు కొట్టాల్సిందే. కొందరి హీరోల వారసులకు మాత్రమే సక్సెస్ వెంట వస్తుంటుంది. మరికొందరికి ఎన్నేళ్లు ఎదురుచూసినా అంచనాలకు తగ్గట్టు సక్సెస్ అందడం లేదు.

ఇలా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల జాబితాలో ముందుంటాడు అక్కినేని అఖిల్. నాగార్జున వారసుడిగా నాగచైతన్య నిలదొక్కుకున్నా.. అఖిల్‌కు మాత్రం సాలిడ్ హిట్ పడడం లేదు. ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తున్నా ప్రేక్షకులను ఆకట్టుకోలేక రేసులో వెనుకబడిపోయాడు. అయితే కొత్త మూవీ లెనిన్‌తో అఖిల్ మాస్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

గత సినిమాల ఫలితాల వల్ల లెనిన్(Linen) విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చివరికి శుక్రవారం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లెనిన్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో చాలా రోజులకు నాగార్జున మొహంలో అఖిల్ సక్సెస్ తాలుకా ఆనందం స్పష్టంగా కనిపించింది.

ఈ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ సినిమాను నిర్మించారు. మాస్ ఎంటర్ టైనర్‌గా మురళీ కిషోర్ అబ్బూరు దీనిని తెరకెక్కించారు.

సునీల్, బ్రహ్మాజీ, రామ్‌కి, శివాజీ, ఈశ్వరి రావు, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించగా థమన్ స్వరాలు అందించారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే అఖిల్ ఏజెంట్ మూవీ డిజాస్టర్‌తో లెనిన్‌కు పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు.

Linen

కానీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ రేంజ్‌లో అఖిల్ సినిమాకు కలెక్షన్లు వచ్చి చాలా కాలమైంది. తొలిరోజు 50 శాతానికి పైగా ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా తెలుస్తోంది. తొలిరోజు ఇండియా వైడ్‌గా 2.14 కోట్ల రూపాయల నెట్ రాబట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు, కర్ణాటకలో రూ.50 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ.50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్ల చొప్పున 7 నుంచి 10 కోట్ల వరకూ ఓపెనింగ్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. ఈ స్థాయి కలెక్షన్లు, పాటిజివ్ టాక్ రావడంతో అఖిల్ ఎమోషనల్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో కేక్ కట్ చేసి తండ్రి నాగార్జునతో ఈ ఆనందాన్ని పంచుకున్నారు.

Polygamy : 2 పెళ్లిళ్లు చేసుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ బంద్.. బహుభార్యత్వాన్ని పాటిస్తే ఉద్యోగం కూడా ఊస్ట్

Exit mobile version