Nominations : బిగ్ బాస్ హౌస్‌లో 12వ వారం నామినేషన్లలో రచ్చ.. వర్షిణిపై సుధీర్ ఫైర్
Nominations : బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో 12 వ వారంలో నామినేషన్ల రచ్చ పీక్స్‌కు చేరింది. వర్షిణి, సుధీర్ వాదనలు, దేబ్జానీ, రాం ప్రసాద్ ట్విస్ట్, శివ్,ముకేష్ సిచ్యువేషన్ గురించి చూడండి.
Nominations
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడు రసవత్తరమైన స్టేజ్‌కు చేరుకుంది. కంటెస్టెంట్లు 12వ వారంలోకి అడుగుపెట్టగా, ఇంట్లో సుమారు 12 మంది సభ్యులు మిగిలి ఉన్నారు. ఫినాలేకు ఇంకా 4 వారాలే టైమ్ ఉండటంతో, ప్రతి ఒక్కరూ తమ గేమ్ తాము ఆడుతూ ఎవరికి వారే తాము నిలదొక్కుకునే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ నడిచిన గ్రూపుల ఆటలకు సుమారు తెరపడినట్లే కనిపిస్తోంది. దీంతో 12వ వీక్ నామినేషన్ల(Nominations) ప్రాసెస హౌస్‌లో వాడివేడిగా, ఊహించని మలుపులతో సాగుతోంది. కెప్టెన్‌గా అమన్ కీలకంగా ఉన్న సమయంలో, దేబ్జానీ అతడిని పక్కకు పో అని అనడంతో ఇద్దరి మధ్య గట్టి ఫైటే నడిచింది.
ఈ ఎపిసోడ్‌లో సుధీర్, వర్షిణి మధ్య జరిగిన నామినేషన్(Nominations) వార్ స్పెషల్‌గా నిలిచింది. రివార్డ్ రివేంజ్ టాస్క్‌లో వర్షిణి బిహేవియర్‌ను సుధీర్ తప్పుబడుతూ ఆమెను నామినేట్ చేశాడు. సుధీర్, శ్వేత కలిసి బాల్స్ వేస్తున్నారని అనుకుని మిగిలిన వాళ్లకు ఇచ్చానని వర్షిణి చెప్పుకొచ్చింది.
ముకేష్‌కు హెల్ప్ అవుతుందనే ఆరోజు తనకు సపోర్ట్ చేయలేదని రాం ప్రసాద్ చెప్పగా.. వర్షిణి దాన్ని ఒప్పుకోకుండా తల అడ్డంగా ఊపింది. రోహిత్ సంచాలక్‌గా ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే తప్పేంటని వర్షిణి వాదించింది. తనను చూడాలని, తనతో మాట్లాడాలని వర్షిణి పట్టుబట్టగా, తప్పు చేశావా లేదా చెప్పమంటే వేరే వాళ్ల పేర్లు లాగుతున్నావని సుధీర్ నిలదీశాడు. దీంతో నీకెందుకు చెప్పాలంటూ వర్షిణి ఎదురుతిరగగా, నీ గేమ్ నువ్వు ఆడకుండా పక్క వాళ్ల గురించి ఆడుతున్నావన్న సుధీర్ , చివరకు కాఫీ ముఖాన కొట్టి ఆమెను నామినేట్ చేశాడు.
మరోవైపు దేబ్జానీ, రాం ప్రసాద్ మధ్య జరిగిన నామినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కెప్టెన్సీ తనకు ఎంత అవసరమో తెలిసినా ఆ రోజు రాం ప్రసాద్ సపోర్ట్ చేయలేదని దేబ్జానీ రీజన్ చెప్పగా.. తనకు ఛాన్స్ వస్తే దేబ్జానీనే కెప్టెన్ చేస్తానని , ఆమెపై అంత ప్రేమ ఉందని రాం ప్రసాద్ చెప్పాడు. కానీ కాఫీ అయిపోయిందని అన్న మాటను గుర్తుచేస్తూ, ఆమె ఇంత సెల్ఫీష్‌గా ఉంటుందని అనుకోలేదని చెప్పాడు.
ఇక శివ్, ముకేష్ విషయాలు కూడా హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బయట త్రిగుణ్‌కు ఉన్న క్రేజ్త్ తెలిసే అతనితో గొడవ పడితే స్క్రీన్ స్పేస్ దొరుకుతుందనే స్ట్రాటజీతో శివ్ వీక్ మొత్తం కూల్‌గా ఉండి, నామినేషన్ల టైమ్‌లో ఫైర్ అవుతున్నాడని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. డిక్టేటర్‌గా ముకేష్ ఫెయిలవ్వడం, వరుసగా నామినేషన్లలో ఉండటంతో ఈ వీక్ నరేష్, రాం ప్రసాద్ వంటి వారు ముకేష్‌ను టార్గెట్ చేసేలా కనిపిస్తున్నారు. ఫినాలే దగ్గర పడుతుండటంతో.. ఈ నామినేషన్ల సెగ ఎవరి గేమ్‌ను ఎటు మలుపు తిప్పుతుందో చూడాలి.
Karthika Pournami : కార్తీక పౌర్ణమి స్పెషల్..ఈరోజు 27 నక్షత్ర దీపాలు వెలిగిస్తే ఏమవుతుంది?





